Site icon Prime9

Vaishali Balsara: సింగర్‌ వైశాలి బల్సారా అనుమానాస్పద మృతి

singer prime9news

singer prime9news

Vaishali Balsara: ప్రముఖ సింగర్‌ వైశాలి బల్సారా అనుమానాస్పద మృతి చెందారు. ఈ ఘటన గుజారాత్లో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతి పై పోలీసులు విచారణ చేస్తున్నారు. అసలు విషయాల్లోకి వెళ్తే గుజరాత్​లోని వల్సాద్ జిల్లాలో ప్రముఖ గాయని వైశాలి బల్సారా మృతదేహం అనుమానాస్పదంగా మృతి చెందారు. ఓ కారులో ఆమె మృత దేహం దొరికింది. పార్‌ నదీ ఒడ్డున గుర్తు తెలియని కారు ఆగి ఉండటంతో అక్కడ ఉన్నా స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కారు డోర్‌ పెన్ చూసి చూస్తే లాక్‌ ఓపెన్‌ చేసి చూడగా ‍బ్యాక్‌ సీట్లో ఓ మృతదేహం కనిపించింది. అది గాయని వైశాలి బల్సారాగా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం చేసిన తరువాత మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా వైశాలి భర్త హితేశ్‌ కూడా సింగరే. ఇద్దరూ కలిసి పలు స్టేజ్‌ షోల్లో పాటలు కూడా పాడారు. శనివారం అర్థరాత్రి నుంచి నా భార్య కనిపించడం లేదని హితేశ్‌ పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ చేశాడు.

సింగర్‌ వైశాలి అనుమానాస్పద మృతి పట్ల పలు అనుమానాలు ఉన్నాయని ఆమె భర్త హితేశ్‌ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశాడు. ఆమె మృతి వెనుక ఎవరి చేతులున్నాయన్నదానిపై పోలీసులు విచారణ కూడా జరుపుతున్నారు. కాగా సింగర్‌ వైశాలి మృతి పట్ల పలు సినీ ప్రముఖులు, ఆమె అభిమానులు మృతి పట్ల సంతాపం తెలిపారు.

Exit mobile version