Site icon Prime9

Thank God: ’థాంక్ గాడ్‘ స్క్రిప్టులో మార్పులు

thank god

thank god

Thank God: అజయ్ దేవ్‌గన్, రకుల్ ప్రీత్ సింగ్ మరియు సిద్ధార్థ్ మల్హోత్రా నటిస్తున్న కామెడీ చిత్రం థాంక్ గాడ్ ఈ ఏడాది దీపావళికి ప్రేక్షకులముందుకు రాబోతుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం స్క్రిప్టులో మార్పులు చేస్తున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలు బాక్పాఫీసు వద్ద ఘోరంగా విఫలమవుతున్నాయి. ఇటీవల విడుదలయిన రక్షాబంధన్, లాల్ సింగ్ చద్దాలు అట్టర్ ప్లాప్స్ గా నిలిచాయి. ఈ నేపధ్యంలో మామాలుకామెడీకాకుండా ప్రేక్షకులను బాగా ఆకర్షించేందుకు మరిన్ని హాస్య సన్నివేశాలను జోడించడం తప్పనిసరని భావించినట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్దితుల్లో తొందరపడకుండా సినిమాను పూర్తి చేసి విడుదల చేయాలని నిర్ణయించారు.

ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో పెద్ద దీపావళి బొనాంజాగా పెద్ద స్క్రీన్‌పై విడుదల కానుందని T-సిరీస్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో తెలిపింది. ఇది బాక్సాఫీస్ వద్ద అక్షయ్ కుమార్ నటించిన రామసేతుతో ఢీకొనవచ్చు.

Exit mobile version