Site icon Prime9

Powerstar Pawan Kalyan : పవన్ కళ్యాణ్ OG మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన బాలీవుడ్ హీరో

Emraan Hashmi said about OG movie new update

Emraan Hashmi said about OG movie new update

Powerstar Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ చిత్రాలు ఉన్న విషయం తెలిసింద .ఆయన ప్రస్తుతం ఓజీ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నారు .అయితే ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సాహో డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో నాని’s గ్యాంగ్ లీడర్ సినిమా ఫేమ్ అందాల భామ ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాను ముంబై నేపథ్యంతో సాగే గ్యాంగ్ స్టర్ స్టోరీతో రూపొందిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా గురించి వరుస అప్డేట్స్ ఇస్తూ అభిమానులను ఖుషి చేస్తున్నారు మేకర్స్. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీలో విలన్‌గా యాక్ట్ చేస్తున్న బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్.. ఓ క్రేజీ అప్టేట్ ఇచ్చాడు. ఓజీ సినిమా.. ఇప్పటివరకు దాదాపు 60 శాతం వరకు ఈ సినిమా టాకీ పార్టును కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ ఇమ్రాన్ హష్మీ, తమిళ్ నటుడు అర్జున్ దాస్, శ్రీయారెడ్డిలు, మరి కొంతమంది స్టార్స్ నటిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇందులో విలన్ పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హస్మీ ఇటీవల ముంబైలో జరిగిన షెడ్యూల్లో జాయిన్ అయ్యారు. పవన్, ఇమ్రాన్ మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో హైలెట్ ఉంటాయని ముందు నుంచి వినిపిస్తోన్న టాక్. దీంతో ఈ సినిమా చూసేందుకు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఈ క్రమంలోనే తాజాగా హీరో ఇమ్రాన్ హాస్మీ ఓజీ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఓజీ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని.. సినిమా కూల్ గా సాగుతుందని అన్నారు. ప్రస్తుతం ఇమ్రాన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. ఈ కామెంట్స్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి

Exit mobile version