Site icon Prime9

Divya Bharathi : సుడిగాలి సుధీర్ కి జోడీగా బ్యాచిలర్ బ్యూటీ “దివ్య భారతి”.. ఏ సినిమా అంటే ?

divya-bharathi confirmed as heroin in sudigali sudheer movie

divya-bharathi confirmed as heroin in sudigali sudheer movie

Divya Bharathi : తమిళ “బ్యాచిలర్” సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యారు “దివ్య భారతి”. తన సొగసైన అందాలతో ప్రేక్షకులకు మంత్రముగ్ధులను చేశారు దివ్య భారతి. ఈ ఒక్క సినిమాతో ఈ అమ్మడి క్రేజ్  అమాంతం పెరిగిందనే చెప్పుకోవాలి. ఆ మధ్యకాలంలో ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఈ సినిమాలోని డైలాగులు రీల్స్ రూపంలో దర్శనమిచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ముద్దుగుమ్మ ఆ సినిమా తర్వాత మరిన్ని సినిమా అవకాశాలు వచ్చిన ఆ సినిమా అంతా క్రేజ్ తెచ్చి పెట్టలేదని చెప్పుకోవాలి. ఈ అమ్మడు.. రెండో చిత్రంగా ‘మధిల్ మెల్ కాదల్’ అనే తమిళ సినిమాలో నటించింది. ఇప్పుడు మూడో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది.

జబర్దస్త్ కామెడీ షో తో కమెడియన్ గా తెలుగు వారి అందరికి పరిచయమైన నటుడు సుడిగాలి సుధీర్. అడపాదడపా పలు సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ వచ్చిన సుధీర్.. సాఫ్ట్‌వెర్ సుధీర్ మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తరువాత త్రీ మంకీస్, వాంటెడ్‌ పండుగాడు వంటి సినిమాతో ప్రేక్షకులను పలకరించినా అవి నిరాశ పరిచాయి. ఇక గత ఏడాది రిలీజ్ అయిన ‘గాలోడు’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకొని సుధీర్ కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చింది. ఇక ఇటీవలే సుధీర్ తన 4వ సినిమాని ప్రకటించాడు. కొత్త దర్శకుడు నరేష్ లీ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు.

ఇప్పుడు తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా దివ్య భారతి నాటిస్తున్నట్లు ఖరారు చేశారు. ఈ ముద్దుగుమ్మకి తెలుగులో మొదటి సినిమా కావడం ఇదే విశేషం. మంచి హిట్ అందుకున్న ఈ భామ.. ఆ రేంజ్ లోనే క్రేజ్ కూడా సొంతం చేసుకొని .. తెలుగులో స్టార్ హీరోల సరసన నటిస్తుంది అని అంతా భావించారు, కానీ అనుకోని రీతిలో సుధీర్ తో మూవీకి ఒకే చేసి అమ్మడు అందరికీ షాక్ ఇచ్చింది. మహాతేజా క్రియేషన్స్ అండ్ లక్కీ మీడియాపై ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తామంటూ ప్రకటించారు.

సినీ చిత్ర పరిశ్రమలో అదృష్టం ఎలా వరిస్తుందో అనేది చెప్పలేము. ఒక్కొక్కసారి మనం ఎంత కష్టపడ్డ ఆశించిన అంత ఫలితం కూడా దక్కదు. కొంత మంది హీరోయిన్స్ అయితే ఏళ్ల తరబడి కష్టపడ్డా గుర్తింపు మాత్రం అంతంత మాత్రమే ఉంటుంది. ఇంకొందరికి మాత్రం అదృష్టం వరిస్తే వెనక్కి తిరిగి చూడరు. అయితే దివ్య భారతికి సినిమాతో పాటు సోషల్ మీడియా పరంగా కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. సామాజిక మాధ్యమాలలో తన ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని ఫుల్ గా పెంచుకుంటున్నారు ఈ భామ. అలానే హీరోలుగా కూడా అదృష్టం చాలా తక్కువ మందినే వరిస్తుంది. అదృష్టంతో పాటు బాగా కష్టపడే సుధీర్ తనదైన శైలిలో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. చూడాలి మరి ఆ బ్యూటీ సుధీర్ కెరీర్ కి ఖచ్చితంగా ప్లస్ అవుతుందనే అందరూ భావిస్తున్నారు.

Exit mobile version