Director Venkatesh Maha : ప్రముఖ యంగ్ డైరెక్టర్ దర్శకుడు వెంకటేష్ మహా తెలుగు పేక్షకులకు సుపరిచితుడే. కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలతో ఆడియండ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. ఈ క్రమంలోనే రెండు, మూడు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన వెంకటేష్.. మళ్ళీ ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు. ‘యాంగర్ టేల్స్’ ఆంథాలజీలో సుహాస్, తరుణ్ భాస్కర్, మడోన్నా సెబాస్టియన్, బిందు మాధవి, రవీంద్ర విజయ్, ఫణి ఆచార్య ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ సిరీస్‌లోని నాలుగు డిఫరెంట్ స్టోరీస్‌కు నలుగురు సినిమాటోగ్రాఫర్లు పనిచేయడం విశేషం.
కేజీఎఫ్ వివాదం..
అయితే ఇటీవలే కేజీఎఫ్ సినిమాపై వెంకటేశ్ మహా పరోక్ష విమర్శలు చేశారు. హీరో క్యారెక్టరైజేషన్ ను ఎద్దేవా చేస్తూ.. అలాంటి సినిమాలను జనం ఆదరిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా యష్ ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అయ్యారు. ఇప్పుడు తాజాగా మరోసారి నెటిజన్లకు అడ్డంగా బుక్కయ్యాడు వెంకటేష్ మహా. ప్రస్తుతం ఈయన.. ‘యాంగర్ టేల్స్’ వెబ్ సిరీస్‌లో కీలక పాత్ర పోషించాడు. నలుగురు డైరెక్టర్లతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకటేష్ మహా.. కమర్షియల్ మసా మసాలా సినిమాలపై, కేజీఎఫ్ సినిమాపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేకించి ‘కేజీఎఫ్’ మూవీలో యశ్ క్యారెక్టర్‌పై ‘నీచ్ కమీన్ ***** ’ అని కామెంట్ చేయడం వివాదాస్పదమైంది.
మళ్ళీ కొత్త వివాదంలో.. 18 ఏళ్ల లోపు వారు వద్దు అంటూ..
నాలుగు డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కిన ఈ ఆంథాలజీని నితిన్ డైరెక్ట్ చేశారు. డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మేరకు వెంకటేష్ మహా ట్విట్టర్ వేదికగా ఒక నోట్ పోస్టు చేశాడు. ఆ నోట్ లో.. ‘అప్‌కమింగ్ వెబ్ సిరీస్ యాంగర్ టేల్స్’లోని నా ఎపిసోడ్ ‘రంగా’లో కథానుసారంగా 18 ఏళ్ల లోపు వారికి తగని భాష వాడబడింది. ఈ ఎపిసోడ్ చూసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా పేరెంట్స్‌ను కోరుతున్నాను. కానీ మిగిలిన 3 ఎపిసోడ్లు ‘రాధ, గిరి, పూజ’లను కుటుంబ సమేతంగా చూసి ఆనందించవచ్చు’ అని రాసుకొచ్చాడు. అందుకు గాను రీసెంట్‌గా ‘కేజీఎఫ్’ మూవీపై తను చేసిన కామెంట్లను గుర్తు చేస్తూ.. నీ సినిమా ప్రమోషన్స్ కోసమే అలా మాట్లాడావా? అంటూ విమర్శిస్తున్నారు.
#AngerTalesOnHotstar
March 9th onwards@tilakprabhala @ActorSuhas @RavindraVijay1 @thebindumadhavi @phanindracharya @TharunBhasckerD @SridharBobbala @MadonnaSebast14 @amardeepguttula @VinodBangari2 @Kalyankodati @smaransai pic.twitter.com/lS5E9QFgOU— Venkatesh Maha (@mahaisnotanoun) March 8, 2023
కేజీఎఫ్ వివాదంపై స్పందిస్తూ తన అభిప్రాయం పట్ల అదే నిర్ణయంతో ఉన్నాను.. కానీ నేను మాట్లాడిన భాష మాత్రం తప్పు అందుకు సారీ అని వెంకటేష్ తెలిపారు.`కేజీఎఫ్` సినిమా కూడా చాలా మందికి నచ్చలేదు, వారంతా నాలాంటి అభిప్రాయంతోనే ఉన్నారు, నేను మాట్లాడింది కరెక్టే అంటూ మెసేజ్‌లు చేస్తున్నారు. అయితే తాను సినిమాలోని కల్పిత పాత్రని విమర్శించాను, తప్ప రియల్ లైఫ్‌లో ఏ వ్యక్తిని, ఏ క్రియేటివ్ పర్సన్‌ని విమర్శించలేదు, తక్కువ చేయలేదు. కాకపోతే తాను వాడిన భాష తప్పు, మాట్లాడిన పదాలు సరిగా లేవని ఆయన తెలిపారు. ఆ విషయంలో తాను క్షమాపణనలు తెలియజేస్తున్నానని తెలిపారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/