Site icon Prime9

Srikanth odela : ఓ ఇంటివాడైన నాని “దసరా” మూవీ డైరెక్టర్ “శ్రీకాంత్ ఓదెల”..

director srikanth odela marraige photos goes viral on media

director srikanth odela marraige photos goes viral on media

Srikanth odela : దర్శకుడు శ్రీకాంత్.. నాచురల్ స్టార్ నానితో “దసరా” సినిమా తెరకెక్కించి మొదటి సినిమా తోనే 100 కోట్లు కలెక్షన్స్ అందుకున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్, షైన్ టామ్ చాకో కీలకపాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. మార్చి 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల సునామిని సృష్టించింది. పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమా రికార్డు కలెక్షన్లతో నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ మూవీగా నిలిచింది.

అయితే తాజాగా ఓదెల శ్రీకాంత్ పెళ్లి చేసుకున్నాడు. సౌమ్యకృష్ణ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఈ వివాహానికి పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. శ్రీకాంత్ పెళ్లి చేసుకున్న అమ్మాయి గురించి వివరాలు ఏమీ తెలియరాలేదు. తమ బంధువుల అమ్మాయనే అంటున్నారు. శ్రీకాంత్ పెళ్లి ఫోటోని షేర్ చేస్తూ నాని.. మన దసరా డైరెక్టర్ శ్రీకాంత్ పెళ్లి చేసుకున్నాడు, మీ అందరూ ఆశీర్వదించండి అని పోస్ట్ చేశాడు. దీంతో శ్రీకాంత్ పెళ్లి ఫోటో వైరల్ గా మారింది. శ్రీకాంత్ ఓదెల సుకుమార్ శిష్యుడనే విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారి మ్యారేజ్ కు సుక్కు  స్పెషల్ గెస్ట్ గా హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

 

తెలంగాణ లోని గోదావరిఖనికి చెందిన శ్రీకాంత్ సినీ పరిశ్రమలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేస్తూ వచ్చాడు. సుకుమార్ దగ్గర ఎక్కువ కాలం డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేశాడు. ఆ తర్వాత ఇటీవలే నానితో దసరా తీసి సూపర్ హిట్ కొట్టాడు. దీంతో శ్రీకాంత్ ఒక్కసారిగా మంచి పేరు సంపాదించుకున్నాడు.

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న చిత్రం పుష్ప 2: ది రూల్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగపుకుంటున్నారు. కాగా బుధవారం పుష్ప 2 చిత్రం ఆర్టిస్టుల బస్సు ప్రమాదానికి గురైంది. నార్కట్‌ పల్లి దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టిస్టులు వెళ్తున్న బస్సు .. ఆగి ఉన్న తెలంగాణ ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఆ ఘటనలో పలువురు ఆర్టిస్టులకు గాయలు అయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తరలించారు. షూటింగ్‌ ముగించుకొని వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురి అయినట్టు తెలుస్తోంది.

Exit mobile version