Site icon Prime9

Anil Ravipudi Speech: గాలోడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి

ani ravipudi speech at gaalodu prerelease event

Tollywood news: సుడిగాలి సుధీర్‍‍‍‍ హీరోగా న‌టిస్తోన్న ప‌క్కా మాస్అండ్‌యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `గాలోడు`. గెహ్నా సిప్పి హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రానికి రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌కృతి స‌మ‌ర్ప‌ణ‌లో సంస్కృతి ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, ట్రైలర్‌లకు విశేషమైన స్పందన లభించింది. ఈ చిత్రం నవంబర్ 18న విడుదలైంది. ఈక్రమంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో..

అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘సుధీర్ నాకు ఎన్నో ఏళ్ల నుంచి తెలుసు. సుప్రీమ్ సినిమాలోనూ నటించాడు. చిన్న స్థాయి నుంచి వచ్చి హీరోగా ఎదగడం మామూలు విషయం కాదు. హీరోగా చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. ఈ టైటిల్ పెట్టుకుని హీరోగా చేయాలంటే ఇంకా గట్స్ ఉండాలి. సినిమాను చూసి అందరూ విజయవంతం చేయండి. సినిమా కోసం ప్రతీ చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

హీరోయిన్ గెహ్నా సిప్పి మాట్లాడుతూ.. ‘ఈ రోజు కోసం మా టీం అంతా ఎంతో ఎదురుచూశాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థాంక్స్. మమ్మల్ని ఇంత బాగా చూపించిన రామ్ ప్రసాద్ గారికి థాంక్స్. సుధీర్‌ సర్‌ చాలా టాలెంటెడ్. మంచి మనిషి. అద్భుతమైన నటుడు. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ.. ‘సూపర్ స్టార్ కృష్ణ మరణం చాలా బాధాకరం. ఆయనకు శాంతి చేకూరాలి. ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేశాం. రెండున్నరేళ్లు అందరూ కష్టపడి పని చేశారు. రాం ప్రసాద్ గారు ఎంత బిజీగా ఉన్నా కూడా ఆయనే ప్రతీ షాట్ తీశారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను. భీమ్స్ గారు ఇచ్చిన సాంగ్స్, ఆర్ఆర్ సినిమాకు ప్రాణంగా నిలిచాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ చేద్దామని ఇంత లేటుగా చెప్పినా కూడా ఇంత మంది వచ్చి ప్రేమాభిమానాలు పంచుతున్నారు. సినిమా హిట్ అయి డబ్బులు వస్తే కూడా ఇంత ఆనందం రాదు. ఇండస్ట్రీకి వచ్చి ఏదైనా సంపాదించాను అంటే.. అది మీ ప్రేమే. ఇక్కడకు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. రాజ శేఖర్ రెడ్డి గారు హీరోగా నాకు చాన్స్ ఇచ్చారు. మళ్లీ ఇంత మంచి సినిమాను నాతో తీసినందుకు ఆయనకు థాంక్స్. గెహ్నా సిప్పీ అద్భుతమైన నటి. ఆమె బాగా చేయడంతో.. నేను కూడా ఇంకా బాగా చేయాలనిపించేంత చక్కగా నటించారు. ఒక్క ఫోన్ కాల్ చేయడంతోనే సుమ గారు, అనిల్ రావిపూడి గారు ఇలా అందరూ వచ్చారు. మీరు (అభిమానులు) నన్ను ఎంత ప్రేమిస్తున్నారో.. వీరంతా కూడా నన్ను అంతే ప్రేమిస్తున్నారు. అభిమానులందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను’ అని అన్నారు.

డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘గాలోడు నవంబర్ 18న రిలీజ్ అవుతుంది. మాకు కావాల్సినన్నీ థియేటర్లు ఇచ్చారు. అందరూ థియేటర్‌కు వచ్చి సినిమాను చూస్తారని ఆశిస్తున్నాను. సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాతో సుధీర్ గారు నాకు దర్శకుడిగా చాన్స్ ఇచ్చారు. ఈ గాలోడు సినిమాతో నిర్మాతగానూ చాన్స్ ఇచ్చారు. టెక్నీకల్ టీం సహాయంతోనే ఈ సినిమాను పూర్తి చేశాం. రామ్ ప్రసాద్, భీమ్స్ అందరూ ఎంతో కష్టపడి పని చేశారు. అందరూ సినిమాను చూడండి’ అని అన్నారు.

రష్మీ గౌతమ్ మాట్లాడుతూ.. ‘సుధీర్ జర్నీ అందరికీ తెలుసు. ఇన్ని రోజులు మా గాలోడు, నా గాలోడు. కానీ ఇకపై సుధీర్ మీ గాలోడు. ఈ గాలిని సరైన డైరెక్షన్‌లో ఆడియెన్స్‌ తీసుకెళ్లాలి. సినిమాను అందరూ చూసి సక్సెస్ చేయండి. సినిమా గురించి మాట్లాడిన ప్రతీసారి కెమెరామెన్ రాం ప్రసాద్ గురించి చెబుతూనే ఉండేవాడు. సుధీర్ అలా చెప్పడం వల్ల నాకు ఆయనతో పని చేయాలని అనిపించింది. సుధీర్‌లో ఉన్న వేరియేషన్స్‌ను చక్కగా చూపించారు. డైరెక్టర్ రాజశేఖర్ గారు మొదటి సారిగా సాఫ్ట్ వేర్ సుధీర్ సమయంలో నమ్మకం పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా అదే నమ్మకంతో గాలోడు తీశారు. సుధీర్‌కు మంచి కమర్షియల్ అంశాలుండే సినిమాలంటే ఇష్టం. ఇది కచ్చితంగా హిట్ అవుతుంది’ అని అన్నారు.

అనసూయ మాట్లాడుతూ.. ‘నేను ఇక్కడకు సుధీర్ కోసం వచ్చాను. వేణు టీంలో మెంబర్‌ నుంచి టీం లీడర్‌ వరకు ఎదిగాడు. టాలెంట్‌ను ఎవ్వరూ ఆపలేరు. సుధీర్ సక్సెస్‌ను చూస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’ అని అన్నారు.

ఆకాష్‌ పూరి మాట్లాడుతూ.. ‘చోర్ బజార్ సినిమాలో గెహ్నాతో పని చేశాను. ఆమెతో పని చేస్తే చిన్న పిల్లతో షూటింగ్ చేసినట్టు అనిపిస్తుంది. ఆమె చాలా టాలెంటెడ్. సుధీర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను ఆయన్ను మొదటి నుంచి ఫాలో అవుతున్నాను. మెజీషియన్ నుంచి జబర్దస్త్ వరకు ఫాలో అవుతున్నాను. సుధీర్ గారిని కలిసేందుకు వందలు, వేలు, లక్షల్లో అభిమానులు వస్తారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి’ అని అన్నారు.

Exit mobile version