Site icon Prime9

Dhamaka: రూ.30 కోట్ల వసూళ్లు రాబట్టిన ’ధమాకా‘

Dhamaka

Dhamaka

Dhamaka: గత శుక్రవారం విడుదలైన రవితేజ ధమాకా మరియు సుకుమార్ నిర్మించిన 18 పేజేస్ చిత్రాలు విడుదలకు ముందు మంచి సంచలనం సృష్టించాయి. అయితే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న మాస్ సినిమా అంచనాలు నిలబెట్టుకోగా లవ్ స్టోరీగా వచ్చిన మూవీ మాత్రం చతికిలపడింది.

మాస్ రాజా రవితేజ యొక్క ధమాకా బ్యాడ్ రివ్యూలు మరియు యావరేజ్ టాక్‌ వచ్చినప్పటికీ కలెక్షన్లు రాబట్టడంలో దూసుకుపోతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం మొదటి వారాంతంలో రూ.30 కోట్ల ‘గ్రాస్’ వసూలు చేసింది. 3వ రోజు (ఆదివారం) ఈ చిత్రం కలెక్షన్లలో అగ్రస్థానంలో నిలిచింది, తద్వారా ఈ మాస్ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారని తెలుస్తోంది. రెండు వరుస ప్లాపుల్లో వున్న రవితేజకు, ఎలాగైనా హిట్ కొట్టాలన్న శ్రీలకు ఈ సినిమా మంచి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. సమీపంలో గట్టిపోటీ ఇచ్చే చిత్రం ఏదీ లేకపోవడం ధమాకా కు కలిసి వచ్చే అంశం.

అదే సమయంలో, నిఖిల్ మరియు అనుపమ జంటగా నటించిన 18 పేజెస్ బాక్సాఫీసు వద్ద నిరాశపరిచింది. ఈ చిత్రం తెలుగు బాక్సాఫీస్ నుండి దాదాపు రూ.9 కోట్ల ‘గ్రాస్’ వసూలు చేసింది. వీరి కాంబోలో వచ్చిన కార్తికేయ 2 విజయంలో సగం కూడా అందుకోలేకపోయింది.

Exit mobile version