Site icon Prime9

Aadi Keshava : ఊరమాస్‌ లుక్ తో అదరగొట్టబోతున్న వైష్ణవ్ తేజ్ .. ఆది కేశవ ట్రైలర్ రిలీజ్ ..

details about aadi keshava movie trailer

details about aadi keshava movie trailer

Aadi Keshava :వైష్ణవ్‌ తేజ్‌, శ్రీలీల జంటగా నటించిన లేటెస్ట్ మూవీ `ఆదికేశవ`. శ్రీకాంత్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ మూవీస్‌ పతాకంపై రూపొందుతుంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. ఇప్పటికే పలుమార్లు పోస్టుపోన్ అవుతూ వచ్చిన ఈ మూవీ.. ఈసారి పక్కా రిలీజ్ అవ్వడానికి సిద్దమవుతుంది. ప్రస్తుతం ఫుల్ ప్రమోషన్స్ మోడ్ లో ఉన్న మూవీ టీం తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని ఒక ప్రత్యేక ఈవెంట్ ఏర్పాటు చేసి రిలీజ్ చేశారు. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంది.

ఉద్యోగం చేయకుండా జాలిగా తిరిగే ఒక అబ్బాయి.. ఒక అమ్మాయితో ప్రేమలో పడడం ఆ తరువాత ఒక పెద్ద సమస్యని ఎదుర్కోవడం అనే కథాంశంతోనే ఈ చిత్రం కూడా రాబోతుందని అర్ధమవుతుంది. మొదటి భాగం హీరోయిన్‌ శ్రీలీలతో ఇంటెన్స్ లవ్‌ ట్రాక్‌తో సాగింది. ఆ తర్వాత పూర్తిగా మాస్‌ యాంగిల్‌ తీసుకుంది. ప్రత్యర్థులను ఎదుర్కొనే క్రమంలో వైష్ణవ్‌ తేజ్‌ ఊరమాస్‌గా మారిపోయాడు. తనదైన హీరోయిజంతో అదరగొట్టాడు.ఈ కథనం మాత్రం రెఫ్రెషింగ్ ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. ట్రైలర్ హీరోహీరోయిన్ లవ్ ట్రాక్ కొత్త ఫీలింగ్ ని అందిస్తుంది. హీరోయిన్ తో కామెడీ రొమాన్స్ చేస్తూ కనిపించిన హీరో.. ట్రైలర్ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి విలన్స్ పై శివతాండవం ఆడుతూ కనిపించాడు. యాక్షన్ సీక్వెన్స్ ని కూడా ఊర మాస్ గా తెరకెక్కించినట్లు తెలుస్తుంది.

ఇక నిర్మాతలు చెప్పినట్లు వైష్ణవ్ తేజ్ తన గత సినిమాలతో పోలిస్తే.. ఈ మూవీలో గెటప్ వైజ్, క్యారెక్టర్ వైజ్ కొత్తగా కనిపించబోతున్నారని అర్ధమవుతుంది. ఇక శ్రీలీల తన క్యూట్ పర్ఫామెన్స్ తో ట్రైలర్ లోనే ఆడియన్స్ మనసు దోచుకుంది. మలయాళ స్టార్ యాక్టర్ ‘జోజు జార్జ్’ ఈ సినిమాలో విలన్ కనిపించబోతున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.వైష్ణవ్‌ తేజ్‌.. `ఉప్పెన` చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. తొలి చిత్రంతోనే వంద కోట్లు వసూలు చేసిన హీరోగా నిలిచారు. ఆ తర్వాత `కొండపొలం`, `రంగరంగ వైభవంగా` చిత్రాలతో వచ్చారు. కానీ ఈ రెండు సినిమాలు ఆడలేదు. దీంతో ఇప్పుడు యంగ్‌ డైరెక్టర్‌ శ్రీకాంత్‌ రెడ్డి దర్శకత్వంలో ఈ నయా లవ్‌ , ప్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం చేశారు. మరి ఈ సినిమా ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో చూడాలి. ఆ నెల 24న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.

 

Exit mobile version
Skip to toolbar