Site icon Prime9

DASARA Trailer: ఎట్లయితే గట్లాయే.. సూస్కుందాం.. ఊరమాస్‌ గా ‘దసరా’ ట్రైలర్

dasara

dasara

DASARA Trailer: నాని నటించిన తాజా చిత్రం ‘దసరా’. ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ లో నాని ఊర మాస్ లుక్ లో కనిపించాడు. ఇప్పటికై ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాని పూర్థి స్థాయి మాస్‌ లుక్‌లో కనిపించనున్నాడు. నానికి జంటగా ఈ సినిమాలో కీర్తి సురేష్‌ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. బొగ్గు గనుల నేపథ్యంలో పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.

పాట ప్రారంభంతో ట్రైలర్.. (DASARA Trailer)

ఈ సినిమా ట్రైలర్ ను పాటతో ప్రారంభించారు. ‘ చిత్తు చిత్తుల బొమ్మ.. శివుని ముద్దుల గుమ్మ’ అనే పాటతో మొదలైంది. ఇక ఈ సినిమాలో నాని ఫుల్‌ మాస్‌ లుక్‌లో కనిపించనున్నాడు.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి మూడో లిరికల్‌ చమ్కీల అంగీలేసి.. ఓ వదినే.. చాకు లెక్క ఉండేటోడే.. అనే పాట విడుదలైంది.

ఈ పాటను ధీ – రామ్ మిర్యాల ఆలపించగా, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. పక్కా జానపథ యాసలో ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఊరమాస్‌గా నాని దసరా.

ఈ సినిమాలో నాని ఊర మాస్ లుక్కులో కనిపించాడు. ఈ సినిమాకు సంబంధించి ఇది వరకే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది.

అందులో ఈర్లపల్లి చుట్టూర బొగ్గు కుప్పలు.. మందంటే మాకు వ్యసనం కాదు.. అలవాటు పడిన సంప్రదాయం అంటూ నాని చెప్పే పల్లెటూరి మాస్‌ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

ఇందులో నాని పూర్తిగా రస్టిక్ పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో నాని చెప్పే మరో డైలాగ్ అభిమానులకు ఆకట్టుకుంటుంది. నీయవ్వ.. ఎట్టైతె గట్లాయే గుండు గుత్తగా లేపేద్దాం.. అనే డైలాగ్ ని ఇరగదీశాడు. బొగ్గుగని బ్యాక్‌ డ్రాప్‌లో ఈ సినిమా ఉండనుంది.

Exit mobile version