Site icon Prime9

Dasara OTT: ఓటీటీలో ‘ధూం ధాం’ చేయనున్న దసరా

Dasara OTT

Dasara OTT

Dasara OTT: నేచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తి సురేశ్ తో కలిసి నటించిన చిత్రం ‘దసరా’. ఇటీవలే విడుదలైన చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. సింగరేణి నేపథ్యంలో తెరకిక్కిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో నాని, కీర్తి సురేశ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ధరణి గా నాని, వెన్నెలగా కీర్తి సురేశ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అనేక మంది సినీ ప్రముఖులు దసరా సినిమాపై ప్రశంసలు కురిపించారు. దర్శకుడి తొలి చిత్రమైనా శ్రీకాంత్ ఓదెల పనితీరుకు ప్రశంసలు అందాయి. నాని కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా దసరా నిలిచింది.

 

వారం రోజుల్లో ఓటీటీలోకి(Dasara OTT)

ఇన్నాళ్లు థియేటర్ లో దుమ్ము రేపిన దసరా చిత్రం.. ఓటీటీలోనూ తన సత్తా చాటేందుకు రెడీ అయింది. దసరా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా దసరా ఓటీటీ రిలీజ్ తేదీని నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. ఏప్రిల్ 27 నుంచి దసరా స్ట్రీమింగ్ అవుతున్నట్టు ట్విటర్ వేదికగా తెలిపింది. థియేటర్ ఈ సినిమా చూడలేకపోయిన ప్రేక్షకులు మరో వారం రోజుల్లో ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయొచ్చు. కాగా, మార్చి 30న విడుదలైన దసరా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. రూ. 65 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. విడుదలైన కొన్నిరోజుల్లోనే రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టినట్టు సినీ విశ్లేషకుల అంచనా వేస్తున్నారు.

 

 

Exit mobile version