Site icon Prime9

Dadasaheb Phalke Awards 2023 : ఆర్ఆర్ఆర్ కు మరో అరుదైన పురస్కారం.. ఘనంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల వేడుక

Dadasaheb Phalke Awards 2023 event completed and rrr got film of the year

Dadasaheb Phalke Awards 2023 event completed and rrr got film of the year

Dadasaheb Phalke Awards 2023 : దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన చిత్రం “ఆర్ఆర్ఆర్”. తెలుగు వారి సత్తాను  చాటుతూ ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ మూవీ. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమా.. ఆస్కార్ రేస్ లో కూడా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా.. తారక్ కొమరం భీమ్ లాగా చేశారు. కాగా ఇప్పుడు తాజాగా అంతర్జాతీయంగా అవార్డులు అందుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు మరో అరుదైన పురస్కారం దక్కింది. ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే దాదా సాహెబ్‌ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్‌ అవార్డు ఈ చిత్రం కైవసం చేసుకుంది.

సోమవారం రాత్రి ముంబైలో జరిగిన ఈ ఫిలిం ఫెస్టివల్‌ 2023 అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఫిలిం ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు దక్కించుకుంది. అలానే కన్నడ నుంచి చిన్న సినిమాగా విడుదలై దేశవ్యాప్తంగా సంచలన విజయం అందుకున్న “కాంతారా” సినిమాలో నటనకు గానూ మోస్ట్‌ ప్రామిసింగ్‌ యాక్టర్‌ అవార్డును రిషబ్‌ శెట్టి దక్కించుకున్నాడు. ఇక ఈ కార్యక్రమంలో వరుణ్‌ ధావన్‌, రోనిత్‌ రాయ్‌, శ్రేయా తల్పాడే, ఆర్‌ బాల్కి, షాహిల్‌ ఖాన్‌, నటాలియా, జయంతి లాల్‌ గడ, వివేక్‌ అగ్నిహోత్రి, రిషబ్‌శెట్టి, హరిహరన్‌, అలియా భట్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

 

అదే విధంగా ఉత్తమ చిత్రంగా ది కశ్మీర్‌ ఫైల్స్‌ అవార్డు దక్కించుకోగా.. ఉత్తమ నటుడిగా రణ్‌బీర్‌ కపూర్‌ ( బ్రహ్మస్త్ర 1), ఉత్తమ నటిగా ఆలియాభట్‌ (గంగూబాయి కథియావాడీ) అవార్డు సొంతం చేసుకున్నారు. ఈ అవార్డుల వేడుకకు రణ్‌బీర్‌ కపూర్‌ హాజరు కాకపోవడంతో రెండు అవార్డులను ఆలియా భట్ తీసుకుంది. చిత్ర పరిశ్రమలో అత్యుత్తమ సేవలు అందించినందుకు గానూ.. రేఖ దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ అవార్డు వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆలియా భట్ తెల్లని శారీలో పాలరాతి శిల్పంలో అందరి మదిని దోచేస్తుంది.

దాదాసాహెబ్‌ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్‌ అవార్డు విజేతలు ఎవరంటే..?

ఉత్తమ దర్శకుడు – ఆర్‌. బాల్కి (చుప్‌ )
క్రిటిక్స్‌ బెస్ట్‌ యాక్టర్‌ – వరుణ్‌ ధావన్‌ (బేడియా )
మోస్ట్‌ వర్సటైల్‌ యాక్టర్‌ – అనుపమ్‌ ఖేర్‌
బెస్ట్ ప్లే బ్యాక్‌ సింగర్‌ – సాచిత్‌ తాండన్‌
క్రిటిక్స్‌ ఉత్తమ నటి – విద్యాబాలన్‌ (జల్సా )
ఉత్తమ సహాయ నటుడు – మనీష్‌ పాల్‌ (జగ్‌ జగ్‌ జియో )

టెలివిజన్‌ /ఓటీటీ విభాగాల్లో విజేతల వివరాలు..

ఉత్తమ నటుడు – జైన్‌ ఇమనాన్ ( ఇష్క్‌ మే మర్‌జావా )
ఉత్తమ నటి – తేజస్వి ప్రకాశ్‌ ( నాగిన్‌ )
ఉత్తమ సహాయ నటి – షీబా చద్దా
ఉత్తమ వెబ్‌ సిరీస్‌ – రుద్ర : ది ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌
ఉత్తమ వెబ్‌సిరీస్‌ నటుడు : జిమ్‌ షార్బ్‌ ( రాకెట్‌ బాయ్స్‌ )
టెలివిజన్‌ సిరీస్‌ ఆఫ్‌ ది ఇయర్ : అనుపమ

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version