Site icon Prime9

Chiyaan Vikram: సరికొత్త లుక్ తో “విక్రమ్”.. “తంగలాన్” మూవీ వీడియో “గ్లింప్స్” రిలీజ్

chiyaan vikram tangalan movie first look released

chiyaan vikram tangalan movie first look released

Chiyaan Vikram: విక్రమ్ ఈ స్టార్ హీరోకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. విభిన్న కథల ఎంపికతో, తన నటనాశైలితో యావత్ దేశవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న ఈ ప్రముఖ హీరో ఇప్పుడు మరో సరికొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీకి సంబంధించి దీపావళి సందర్భంగా వీడియో గ్లింప్స్ నెట్టింట సందడి చేస్తోంది.

కోబ్రా సినిమాతో మంచి హిట్ కొట్టిన చియాన్ విక్రమ్ మరో సరికొత్త కథతో మనముందుకు రాబోతున్నారు. కబాలి, కాలా వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ ఒక వైవిధ్యమైన మూవీలో నటిస్తున్నారు. చియాన్ విక్రమ్ సినిమా సినిమాకు కొత్తదనం చూపించడం కోసం సరికొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఈ తరుణంలో అతను ఏం చేసినా చాలా కొత్తగానే ఉంటుంది. ఇప్పటి వరకు 60 సినిమాల్లో విభిన్న పాత్రలతో అలరించిన ఈ విలక్షణ హీరో తాజాగా 61వ సినిమాను మొదలుపెట్టారు. తంగలాన్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి విక్రమ్ లుక్ వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు దర్శకుడు పా రంజిత్.

స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కె.ఇ. జ్ఞానవేల్ నిర్మాతగా స్వాతంత్య్రం రాక ముందు గిరిజన తెగలో చోటు చేసుకున్న యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో విక్రమ్ గిరిజన నాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ పాత్రలో చియాన్ గెటప్ చాలా సహజంగా ఉంది. సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో విక్రమ్ గిరిజన నాయకుడిగా కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్, పశుపతి తదితరులు నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమాకి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.

ఇదీ చదవండి: దీపావళి వేళ సందడి చేస్తున్న కొత్త సినిమా పోస్టర్లు..!

Exit mobile version