Site icon Prime9

Chiranjeevi: చిరంజీవితో కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్ భేటీ

Chiranjeevi

Chiranjeevi

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున తో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ భేటీ అయ్యారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అనురాగ్ ఠాగూర్ ను చిరంజీవి తన ఇంటికి ఆహ్వానించారు. ఈ క్రమంలో చిరంజీవి నివాసానికి కేంద్ర మంత్రి వెళ్లారు. ఈ భేటీలో అక్కినేని నాగార్జున కూడా పాల్గొన్నారు.

కలవడం చాలా ఆనందంగా ఉంది : చిరంజీవి(Chiranjeevi)

ఈ సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన పలు విషయాలపై చర్చించుకున్నారు. కేంద్రమంత్రి తో భేటీ సంబంధించిన ఫొటోలను చిరంజీవి ట్విటర్ లో షేర్ చేశారు. ‘హైదరాబాద్ పర్యటనలో భాగంగా మీరు మమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. భారతీయ సినీ పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా సాధిస్తున్న పురోగతిపై నా సోదరుడు నాగార్జునతో కలిపి మీతో చర్చించడం సంతోషంగా ఉంది’ అంటూ చిరంజీవి ట్వీట్ లో పేర్కొన్నారు. భేటీ సందర్భంగా అల్లు అరవింద్ కూడా అక్కడే ఉన్నారు. మరోవైపు, రానున్నది ఎన్నికల కాలం కావడంతో వీరి భేటీపై ఆసక్తి నెలకొంది.

ప్రస్తుతం చిరంజీవి ‘భోళా శంకర్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌ కాగా, కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తోంది. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు చిరంజీవి తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ ఓటీటీలో ఈరోజు నుంచి సందడి చేయనుంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది.

 

Exit mobile version