Site icon Prime9

Chiranjeevi-Sunita Williams: ఇది.. నిజమైన బ్లాక్‌బస్టర్‌ – సునీత విలియమ్స్ రాకపై చిరు ట్వీట్‌

Chiranjeevi Tweet About Sunita Williams: వ్యోమగాములు సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్మోర్‌లు భూమిని చేరుకున్నారు. గతేడాది జూన్‌లో అంతరిక్షంలోకి వెళ్లిన వీరు తొమ్మిది నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సురక్షితంగా భూమిపైకి వచ్చారు. దీంతో వారికి ప్రపంచమంతా ఘన స్వాగతం పలుకుతోంది. ప్రతి ఒక్కరి వారి ఆత్మస్థైర్యాన్ని కొనియాడుతున్నారు. అలాగే మెగాస్టార్‌ చిరంజీవి వారికి గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ఇది ప్రపంచంలోనే ఎవరూ చేయని, ఎన్నడు జరగని సాహస యాత్ర అన్నారు.

“భూమికి తిరిగి స్వాగతం సునీత విలియమ్స్‌, బుచ్‌ విల్మోర్‌. మీ రాక చారిత్రాత్మకమైంది. ఎనిమిది రోజుల్లో తిరిగి రావాలని అంతరిక్షానికి వెళ్లి.. 286 రోజుల తర్వాత తిరిగి వచ్చారు. ఆశ్చర్యకరమైన రితీలో 4577 సార్లు భూమి చూట్టూ తిరిగారు. మీరు గొప్ప ధైర్యవంతులు. మీ ఈ సాహసం సాటిలేనిది. ఎవరూ నమ్మశక్యం కానీ అద్భుతమైన థ్రిల్లర్‌. ఇప్పటి వరకు ఎవరూ చేయని గొప్ప సాహసం. నిజమైన బ్లాక్‌బస్టర్‌!” అంటూ రాసుకొచ్చారు. అలాగే హీరో మధవన్‌ కూడా వీరికి సంతోషంగా స్వాగతం చెబుతూ ట్వీట్‌ చేశారు.

“మా ప్రార్థనలు ఫలించాయి. మీరు(సునీత) నవ్వుతూ భూమికి చేరుకోవడం అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. 286 రోజులు అంతరిక్షంలో ఉన్న మీరు లక్షలాది మంది ప్రజల ప్రార్థనల వల్ల తిరిగి భూమిని చేరుకున్నారు. మిమ్మల్ని తిరిగి తీసుకువచ్చేందుకు శ్రమించిన నాసాలోని ప్రతి ఒక్క సిబ్బందికి ధన్యవాదాలు. ఆ దేవుడు ఆశీస్సులు మీపై ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నా” అని అన్నారు.

కాగా సునీత విలియమ్స్‌ రాకపై ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. గతేడాది జూన్‌ 5నలో సునీత విలియమ్స్‌, బుచ్‌ విల్మోర్‌లతో పాటు మరో ఇద్దరు ఐఎన్‌ఎస్‌కు వెళ్లగా.. సాంకేతిక కారణాల వల్ల వారు తిరిగి రావడం కుదరలేదు. దీంతో వారు అనుకోకుండ 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలో నిన్న తెల్లవారుజామున 3:27 గంటలకు అమెరికాలోని ప్లోరిడా తీరంలో సాగర జలల్లాలో దిగారు. స్పేస్‌ఎక్స్‌కు చెందిన క్రూ డ్రాగన్‌ ఫ్రీడమ్‌ వారిని సురక్షితంగా భూమిపైకి తీసుకువచ్చింది.

Exit mobile version
Skip to toolbar