Site icon Prime9

Sai Dharam Tej : భారీ హిట్ కొట్టిన సాయి ధరమ్ తేజ్ “విరూపాక్ష”.. మేనల్లుడుని అభినందించిన మెగా మామయ్యలు

chiranjeevi-and-pawan-kalyan-appreciate-sai-dharam-tej-for-virupaksha-success

chiranjeevi-and-pawan-kalyan-appreciate-sai-dharam-tej-for-virupaksha-success

Sai Dharam Tej : సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాతో భారీ హిట్ కొట్టాడు. మిస్టికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా నిన్న (ఏప్రిల్ 21)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమాకి అటు ఆడియెన్స్ నుంచి.. ఇటు సినీ విశ్లేషకులు, ప్రముఖుల నుంచి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. దీంతో చిత్ర యూనిట్ అంతా ఫుల్ ఫుల్ జోష్ సక్సెస్ సెలబ్రేషన్ జరుపుకోగా.. తాజాగా సాయి ధరమ్ తేజ్ ను మెగా మామయ్యలు అభినందించడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

బైక్ యాక్సిడెంట్ తో ప్రాణాపాయం నుంచి బయట పడిన తర్వాత.. తేజ్ నటించిన తొలి చిత్రం విరూపాక్ష. సాయి ధరమ్ తేజ్ కి సెకండ్ ఇన్నింగ్స్ లాగా వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో మెగా ఫ్యామిలీ అంతా కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే పలువురు ప్రముఖులు తేజ్ ని అభినందించారు. ఇప్పుడు తాజాగా సొంత మామయ్యల వంతు వచ్చేసింది అని తెలుస్తుంది. సాధారణంగానే చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా మూవీ బాగుంటే వారిని అభినందిస్తుంటారు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఇప్పుడు తన మేనల్లుడు, సాయి సినిమా హిట్ కావడం పట్ల చిరంజీవి స్పందిస్తూ తెగ మెచ్చుకున్నారు.

మంచి కమ్ బ్యాక్ ఇచ్చావంటూ చిరు.. కార్డు రాసి విషెస్ చెప్పిన పవన్  (Sai Dharam Tej)

ఈ మేరకు ట్విట్టర్ వేదికగా విరూపాక్షకు అద్భుతమైన స్పందన వస్తుందని విన్నాను. సాయి ధరమ్ తేజ్ నిన్ను చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది. మంచి బ్యాంగ్ తో కమ్ బ్యాక్ ఇచ్చావ్. మీ సినిమాను ప్రేక్షకులు ఆదరించి ఆశీర్వదిస్తున్నందుకు ఆనందంగా ఉంది! మొత్తం టీమ్‌కి హృదయపూర్వక అభినందనలు” అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తేజ్ కు సురేఖ కేక్ తినిపిస్తున్న ఫోటోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. అలానే  పవర్ స్టార్ కూడా సాయి ధరమ్ తేజ్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే ఒక కార్డు తో పాటు, బుకే పంపించారు. ఆ కార్డు లో ” డియర్ తేజ్ గారు.. విరూపాక్ష గ్రాండ్ సక్సెస్ అయ్యినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు” అంటూ రాసుకొచ్చారు. ఇక వీరి కార్డు మీద రాసి పంపాడు.

 

 

ఇక వీరి ట్వీట్ లకు “చాలా థాంక్స్.. చిన్న మామ.. ఎంతటి అద్భుతమైన రోజు .. విరూపాక్ష నాకు ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ను అందించింది. పెద్ద మామ నుండి ప్రశంసలు అందించింది. ఇప్పుడు మీ ప్రేమను, అద్భుతమైన మాటలను, ప్రశంసలను అందించింది. నేనెప్పుడూ మీకు కృతజ్ఞుడిగా ఉంటాను” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తేజ్ సైతం తన మొదటి సినిమా నుంచి ఈ సినిమా వరకు తాను నిలబడింది వాళ్ళ మామయ్యల వలనే అని, వారు లేకపోతే ఈరోజు తాను లేనని చెప్తూనే వస్తున్నాడు.

ఇక మూవీ విషయానికి వస్తే మొదటి సినిమా అయినా కూడా కార్తీక్ టాలెంట్ నిరూపించుకున్నాడు. ప్లాటినం లెగ్ బ్యూటీ సంయుక్త కూడా అందంతో పాటు అభినయంతో కూడా దుమ్ములేపింది. త్వరలోనే పాన్ ఇండియా రేంజ్ లో మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version