Site icon Prime9

Adipurush : ఓం రౌత్ – కృతి సనన్ ఇష్యూపై స్పందించిన చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్..

chilukuri balaji temple priest rangarajan fires on adipurush director om raut

chilukuri balaji temple priest rangarajan fires on adipurush director om raut

Adipurush : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో రాబోతున్న “ఆదిపురుష్” కూడా ఒకటి. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా చేస్తున్నారు. కాగా బాలీవుడ్ భామ కృతి సనన్ సీతగా.. ప్రముఖ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా రిలీజ్ కానుంది. సుమారు 500కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ మూవీని టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించాయి.

ఇక రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ మూవీ.. ఇటీవల తిరుపతిలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న సంగతి అందరికి తెలిసిందే. అనంతరం దర్శకుడు ఓం రౌత్, కృతి సనన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే శ్రీవారి సన్నిధి ప్రాంగణంలో ఓం రౌత్ చేసిన ఒక పని ఇప్పుడు వివాదంగా మారుతుంది. దర్శనం అనంతరం కృతి సనన్ వెళ్లిపోతున్నా సమయంలో ఓం రౌత్ ని కౌగిలించుకోవడం, ఓం రౌత్ ఆమెకు ముద్దు ఇవ్వడం పై భక్తులు ఫైర్ అవుతున్నారు. తాజాగా ఈ విషయం పై చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్వామివారి శేష వస్త్రాలు ధరించి కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం వంటి పనులు చేయడం తన మనసుకి ఆందోళన కలిగించిందని రంగరాజన్ తెలిపారు. తిరుమల కొండపై అటువంటి వికారమైన చేష్టలు చేయకూడదని, అది శాస్త్ర సమ్మతం కాదని చెప్పుకొచ్చారు. తిరుమల కొండకు వచ్చినప్పుడు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. భార్యాభర్తలు సైతం వారి ఆలోచనా విధానంలో జాగ్రత్తగా వ్యవహరించాలని రంగరాజన్ సూచించారు. ఓం రౌత్ చేసిన పనిని తీవ్రంగా తప్పుబట్టారు. కాగా ఈ వివాదం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారే అవకాశం ఉంది. దీని పై మూవీ టీం (Adipurush) వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారేమో చూడాలి.

Exit mobile version