Site icon Prime9

Sagileti Katha : హీరో నవదీప్ ఆధ్వర్యంలో ‘సగిలేటి కథ’ మూవీ నుంచి ‘చికెన్ సాంగ్’ ఔట్.. లాంచ్ చేసిన టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్

chicken song out from sagileti katha movie launched by tollywood directors

chicken song out from sagileti katha movie launched by tollywood directors

Sagileti Katha : రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘సగిలేటి కథ’. ఈ చిత్రానికి రాజశేఖర్‌ సుద్మూన్‌ దర్శకత్వం వహించారు. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే కథాంశంగా వస్తున్న ఈ చిత్రాన్ని హీరో నవదీప్‌ సి-స్పేస్ సమర్పణలో, షేడ్‌ ఎంటర్టైన్మెంట్‌, అశోక్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో దేవీప్రసాద్‌ బలివాడ, అశోక్‌ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయ్యిన ట్రైలర్ ప్రేక్షకుల నుండి అశేష ఆధరణ పొందడంతోపాటు, విడుదలైన సాంగ్స్ కి కుడా మంచి అప్లాజ్స్ రావడం విశేషం. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి కీలకమైన ‘చికెన్’ సాంగ్ ని రిలీజ్ చేశారు.

ఈ మేరకు ప్రముఖ ‘కోడి కూర చిట్టి గారే’ రెస్టారెంట్ లో సాంగ్ లాంచ్ జరిగింది. హీరో నవదీప్ ఆధ్వర్యంలో టాలీవూడ్ సక్సెస్ ఫుల్ యంగ్ డైరెక్టర్స్, ‘బేబీ’ ఫేమ్ సాయి రాజేష్, ‘కేర్ ఆఫ్ కంచరపాలెం’ వెంకటేష్ మహా, ‘కలర్ ఫోటో’ సందీప్ రాజ్ ముఖ్య అతిధులుగా విచ్చేసి ‘చికెన్’ సాంగ్ ని ఘనంగా విడుదల చేసారు. ఈ సందర్భంగా సాంగ్ లాంచ్ కి విచ్చేసిన ముఖ్య అతిధులు మూవీ టీమ్ కి బీస్ట్ విషెస్ తెలియజేశారు.

డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ.. ఈ సినిమాని హీరో నవదీప్ ప్రెజెన్స్ చేస్తున్నందుకు చాలా హ్యాపీ గా ఉంది. ఎందుకంటే, కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలో ఆయన ఎప్పుడు ముందుంటారు. నాకు ఒకరోజు ప్రొడ్యూజర్ యస్.కె.యన్ సగిలేటికథ సినిమా ట్రైలర్ చూపించారు. ఆ ట్రైలర్ చూసినప్పుడే, నేను బలంగా నమ్మాను. ఈ సినిమా సూపర్ హిట్ అని. సినిమాలో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ బాగా నటించారు. తప్పకుండా, ఈ సినిమా ని ప్రతి ఒక్కరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.

డైరెక్టర్ వెంకటేష్ మహా మాట్లాడుతూ.. నాకు నవదీప్ కాల్ చేసి ఇలా, సాంగ్ లాంచ్ ఉంది మీరు రావాలి అన్నారు. ట్రైలర్, పోస్టర్స్ చూసాక చాలా ప్రామిసింగ్ గా అనిపించాయి. రూట్ లెవెల్ లో వస్తున్న ఈ సినిమా క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుందని నవదీప్ చెప్పారు. క్లైమాక్స్, విన్నాక ఇది మరో బ్లాక్ బాస్టర్ అనిపించింది. డైరెక్టర్ రాజశేఖర్ కి మంచి భవిషత్తు ఉంది. ఈ మూవీ టీం కి నా ఆల్ ది బెస్ట్.

డైరెక్టర్ సందీప్ రాజ్ మాట్లాడుతూ.. ముందుగా, నవదీప్ అన్నయ్య కి ఆల్ ది బెస్ట్. ఈ సినిమాలో కొత్త వాళ్ళైనా నటన అద్భుతంగా చేసారు. ముఖ్యంగా, సినిమాలో మ్యూజిక్ వేరే లెవెల్. నేను చికెన్ లిరికల్ సాంగ్ చూడగానే, ఈ సినిమా పక్కా హిట్ అనిపించింది. ప్రతి సినిమాకి మ్యూజిక్ ఎంతో ప్రధానం. కాబట్టి, ఈ సినిమా మరో ‘బలగం’ రేంజ్ లో హిట్ కొడతారని బలంగా నమ్ముతున్నాను.

హీరో నవదీప్ మాట్లాడుతూ.. మా సి స్పెస్ ద్వారా ఇలాంటి కంటెంట్ ఉన్న ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకి వస్తున్నందుకు మా టీమ్ అందరు చాలా హ్యాపీ. డైరెక్టర్ రాజశేఖర్ చాలా టాలెంటెడ్, స్వతహాగా పైకి వస్తున్న వ్యక్తి. పైగా, అన్ని క్రాఫ్ట్స్ ని తనే స్వయంగా హ్యాండిల్ చేసి టీమ్ ని ముందుకి నడిపించారు. ప్రొడ్యూజర్స్, దేవి ప్రసాద్ బలివాడ, అశోక్ కి నా ఆల్ ది బెస్ట్. ఈ సినిమాలో రోషం రాజు క్యారెక్టర్ నాకు ఇష్టం. అలాగే, ఈ సినిమాలో కామిడి అందరిని నవ్విస్తుంది. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసాక చికెన్ తినాలనిపిస్తుంది, ఇంక్లూడింగ్ వెజిటేరియన్ వాళ్లకి కూడా..సో, మా మూవీ అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకి వస్తుంది, ప్రతి ఒక్కరు థియేటర్ కి వచ్చి మా టీమ్ ని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని U/A సర్టిఫికెట్ రావడంతో, చిత్ర యూనిట్ అక్టోబర్ 13న రీలిజ్ చేయనున్నారు.

Exit mobile version
Skip to toolbar