Site icon Prime9

Nagarjuna: చందు మొండేటి దర్శకత్వంలో నాగార్జున

Tollywood: కింగ్ నాగార్జున ది ఘోస్ట్, బ్రహ్మాస్త్ర చిత్రాల షూటింగులను పూర్తి చేశారు. ప్రస్తుతం నాగార్జున స్క్రిప్ట్‌లు వింటున్నాడు . అతన మోహన్ రాజా దర్శకత్వంలో తన 100వ చిత్రానికి సంతకం చేసాడు. ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని కూడా కీలక పాత్రలో ఉన్నాడు. నాగార్జున చందు మొండేటితో చాలా కాలంగా చర్చలు జరుపుతున్నారు. ఇటీవలే ప్రాజెక్ట్ ఖరారు చేయబడింది. నాగార్జున దీనికి ఆమోదం తెలిపారు. ఈ సంవత్సరం షూటింగ్ ప్రారంభమవుతుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు.

చందూ మొండేటి దర్శకత్వం వహించిన కార్తికేయ 2 శనివారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిఖిల్ మరియు అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషించారు. చందు మొండేటిఈ చిత్రానికి త్వరలో సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. నాగార్జున సినిమాను స్టార్ట్ చేయడానికి ముందు కార్తికేయ 2తో హిట్ కొడితే అది ఈ దర్శకుడికి మరింత బూస్ట్ ఇస్తుంది.

Exit mobile version