Site icon Prime9

Sharukh Khan : మొదటి సారి తిరుమల శ్రీవారిని దర్శిచుకున్న బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్.. జవాన్ టీమ్ తో కలిసి 

bollywood star hero Sharukh Khan with jawan team visited tirumala

bollywood star hero Sharukh Khan with jawan team visited tirumala

Sharukh Khan : బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో.. షారూఖ్ నటిస్తున్న విషయం తెలిసిందే. “జవాన్” పేరుతో వస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. అంతే కాదు సౌత్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ చేయడంతో పాటు.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్ గా చేస్తుండడం గమనార్హం. ఇక ఈ మూవీని ఈ నెల 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడం కోసం సన్నాహాలు చేస్తున్నారు.

జవాన్ సినిమా కోసం ఎప్పుడు లేని విధంగా షారుఖ్ ఖాన్ ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఈసారి బాలీవుడ్ తో పాటు సౌత్ ఆడియన్స్ ను కూడా బాగా టార్గెట్ చేశాడు. అందుకు ప్రమోషన్లు, సోషల్ మీడియా చిట్ చాట్ తో పాటు.. ఆధ్యాత్మిక యాత్రలు కూడా చేస్తున్నాడు. అందులో భాగంగా ఆమధ్య సీక్రేట్ గా జమ్ము కాశ్మీర్ లోని వైష్ణోదేవి ఆలయాన్ని దర్శిచుకున్న షారుఖ్.. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు.

షారుఖ్ ఖాన్ తన కుటుంబంతో పాటు, నయనతార, జవాన్ టీమ్ తో కలిసి నేడు( సెప్టెంబర్ 05) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు . భార్య గౌరీ ఖాన్‌, కుమార్తె సుహానా ఖాన్, నటి నయనతార, ఆమె భర్త భర్త దర్శకుడు విగ్నేష్ శివన్ కూడా స్వామి వారిని దర్శించుకున్నారు. తొలుత దేవస్థానం అధికారులు షారుఖ్‌కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆ తరువాత షారుఖ్ గర్భాలయంలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆ తరువాత పండితులు షారుఖ్‌కు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం ఇచ్చి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. దీంతో మొదటిసారి షారుఖ్ ఖాన్ తిరుమలకు రావడంతో ఆలయంలోకి నడిచి వెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

షారుఖ్ ఖాన్ పఠాన్‌తో పెద్ద తెరపై అద్భుతమైన పునరాగమనం చేశాడు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదుకొణె మరియు జాన్ అబ్రహం కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అందరి నుండి అద్భుతమైన స్పందనను అందుకుంది. బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.

 

Exit mobile version