Site icon Prime9

Sonakshi Sinha-Zaheer Iqbal Wedding: వివాహవేడుకతో ఒక్కటయిన సోనాక్షి సిన్హా-జహీర్ ఇక్బాల్‌ జంట

Sonakshi Sinha-Zaheer Iqbal

Sonakshi Sinha-Zaheer Iqbal

Sonakshi Sinha-Zaheer Iqbal Wedding:బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తన చిరకాల ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను ముంబైలో సోమవారం సన్నిహితుల సమక్షంలో పెళ్లాడింది. పెళ్లి సందర్బంగా సోనాక్షి సిన్హా పెద్ద బ్రాండ్‌లు, డిజైనర్ వేర్‌లన్నింటినీ వదిలేసి తన తల్లి పెళ్లి చీరను ఎంచుకుంది. జూలై 9, 1980న, పూనమ్ సిన్హా తెల్లటి చీరలో ప్రముఖ నటుడు శత్రుఘ్న సిన్హాను వివాహం చేసుకుంది. ఇపుడు సోనాక్షి తన పెళ్లికోసం అదే చీరనుఎంపిక చేసుకుంది. మరోవైపు, వివాహ వేడుకలో జహీర్ కూడా తెల్లటి కుర్తా ధరించాడు. అనంతరం జరిగిన రిసెప్షన్ సందర్బంగా సోనాక్షి ఎరుపు రంగు బనారసీ పట్టు చీరను, ఇక్బాల్ తెల్లటి షేర్వానీని ధరించారు. సోనాక్షి సిన్హా, జహీర్ 7 సంవత్సరాల డేటింగ్ తర్వాత వివాహం చేసుకున్నారు. రెండేళ్ల కిందట డబుల్ ఎక్స్‌ఎల్‌ చిత్రంలో కూడా ఈ జంట కలిసి కనిపించారు.

 

Exit mobile version
Skip to toolbar