Priyanka Chopra:బాలీవుడ్ సూపర్ స్టార్ ప్రియాంక చోప్రాను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇటు బాలీవుడ్, అటు హాలీవుడ్‌ను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె రోమ్‌లో జరిగిన బల్గేరియస్ 140వ వార్షికోత్సవంలో అందరి చూపు తనపై తిప్పుకొనేలా చేసుకున్నారు పింకీ చోప్స్. ఈ సందర్బంగా లగ్జరీ బ్రాండ్ కొత్త హై ఎండ్ జ్యువెలరీ కలెక్షన్ ఎటెర్నాను ఆవిష్కరించారు. కాగా ఈ లాంచింగ్‌కు ఆమె బల్గేరియస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌లుగా ఉన్న షు క్యు, అన్నా హాత్‌వే, లియు యుఫైతో కలిసి వేదిక పంచుకున్నారు. అటు తర్వాత జరిగిన డిన్నర్‌లోకూడా ప్రియాంక హల్ చల్ చేశారు.
రూ.350 కోట్ల నెక్లెస్ ..(Priyanka Chopra)
అయితే ఇక్కడ అసలు విషయానికి వస్తే ఈ స్పెషల్ ఈవెంట్‌కు ఆమెకు అత్యంత ఖరీదైన నక్లెస్ ధరించి వచ్చారు. ఈ న్యూ కలెక్షన్ బల్గేరియస్‌లో అత్యంత ఖరీదైన నెక్లెస్‌గా చెబుతున్నారు. రఫ్ డైమండ్స్ కట్ చేసి నెక్లెస్‌గా రూపుదిద్దినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ నెక్లెస్‌లో మొత్తం 698 డైమండ్స్ పొదిగారు. అన్నీకలిపి 61.81 కేరట్లు ఉండవచ్చునన్న సమాచారం. కాగా ఈ మాస్టర్ పీస్ నెక్లెస్‌ను తయారు చేయడానికి సుమారు 2,800 గంటలు పట్టిందట! దీని ధర సుమారు 43 మిలియన్ డాలర్లు అని చెబుతున్నారు. భారతీయ కరెన్సీ ప్రకారం చూస్తే.. సుమారు రూ.350 కోట్ల ధర పలుకుతుందని బుల్గేరియస్ వర్గాలు చెబుతున్నాయి.
కంపెనీ వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించారు. 140 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కంపెనీ 200 కేరట్ల కలిగిన సింగిల్ రఫ్ స్టోన్‌ను సీనియర్ ఆర్టిస్ట్ ద్వారా నెక్లెస్‌గా తయారు చేయించారు. కాగా ప్రియాంక ఈ నెక్లెస్‌ను ధరించి అందరి చూపును తన వైపునకు తిప్పుకునేలా చేసుకున్నారు. కాగా ఈ బాలీవుడ్ బ్యూటీ రోమ్‌లో బల్గేరియస్ కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. ఇక ప్రియాంకా విషయానికి వస్తే 2021 నుంచి బల్గేరియస్‌కు గ్లోబల్ అంబాసిడర్‌గా వ్యవహరించారు.