Site icon Prime9

Mirzapur: ‘మీర్జాపూర్’ మూడో సీజన్ వచ్చేస్తోంది

Mirzapur's Guddu Bhaiyya AKA Ali Fazal wraps up season 3

Mirzapur's Guddu Bhaiyya AKA Ali Fazal wraps up season 3

Mirzapur: ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ గురించి సినీ లవర్స్ కి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయిన ఈ సిరీస్ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. మన దేశంలో అతి పెద్ద విజయం సాధించిన వెబ్ సిరీస్ గానూ అనేక రికార్డులు సృష్టించింది. తొలుత హిందీలో విడుదలైన ఈ సిరీస్ తర్వాత తెలుగు సహా అనేక ప్రాంతీయ భాషల్లో ప్రసారమైంది. అన్ని భాషల్లోనూ ఈ వెబ్ సిరీస్ కు అద్భుత స్పందన లభించింది. ఇప్పటికే మీర్జాపూర్ రెండు సీజన్లు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అందులోనూ ముఖ్యంగా గుడ్డూ పండిట్ పాత్రలో అలీ ఫజల్, మున్నా త్రిపాఠిగా దివ్యేంద్రు, అఖండానంద్ త్రిపాఠిగా పంకజ్ త్రిపాఠి అద్భుత నటన కనబరిచారు. ఈ పాత్రలను ప్రేక్షకులను అంత సులభంగా మర్చిపోలేరు.

తన అన్న, చెల్లిని చంపిన మున్నా త్రిపాఠిని గుడ్డూ పండిట్ హతమార్చడంతో రెండో సీజన్ పూర్తవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది మూడో సీజన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వెబ్ సిరీస్ లవర్స్ కి అలీ ఫజల్ గుడ్ న్యూస్ చెప్పాడు. మీర్జాపూర్ మూడో సీజన్ షూటింగ్ పూర్తయిందని వెల్లడించాడు. వెబ్ సిరీస్ బృందంతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. గోలు గుప్తా పాత్రలో నటించిన శ్వేతా త్రిపాఠి ఇతర నటులు, సాంకేతిక సిబ్బంది షూటింగ్ పూర్తయిన సందర్భంగా గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేస్తున్న వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. దానితో త్వరలోనే మీర్జాపూర్ సీజన్ 3 ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ప్రేక్షకులు తెగ సంబుర పడుతున్నారు.

ఇదీ చదవండి: ఇండిగోపై ఫైర్ అయిన హీరో రానా.. క్షమాపణలు చెప్పిన ఎయిర్ లైన్స్

Exit mobile version