Site icon Prime9

Bollywood: బాలీవుడ్ భామల కర్వాచౌత్ వేడుకలు చూద్దామా..!

karwa chauth celebrations in bollywood 2022

karwa chauth celebrations in bollywood 2022

Bollywood: దేశంలోని ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకునే పండుగ కర్వాచౌత్‌. కాగా ఈ పర్వదినం సందర్భంగా బాలీవుడ్‌లో పలు కొత్త జంటలు సందడి చేశాయి. మహిళలు భర్త క్షేమం కోరుతూ ఈ పండుగను ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీ. దీని కోసం వివాహితలు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం జల్లెడలో చందమామను చూసిన అనంతరం తమ భర్తల మొహాలు చూడడంతో ఈ పండుగ పూర్తవుతుంది.

కర్వాచౌత్‌ నేపథ్యంలో పలువురు కథానాయికలు సంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోయారు. ఈ ఏడాదే కొత్తగా పెళ్లైన జంటలు ఈ పండును ఘనంగా జరుపుకున్నాయి.  కటిన్రాకైఫ్‌, విక్కీ కౌశల్‌ జంట తొలి కర్వాచౌత్‌ నిర్వహించుకున్నారు. వరుణ్‌ ధావన్‌-నటాషా దలాల్‌ జంట ఈ పండుగలో సందడి చేసింది. మౌనీరాయ్‌ తొలి కర్వాచౌత్‌ను భర్త సురజ్‌తో కలసి ఘనంగా జరుపున్నారు. ఇక రిచాచద్దా, అలీఫజల్‌ జంట, విక్రాంత్‌ మాసే, శీతల్‌ ఠాకూర్‌ కర్వాచౌత్‌ను ఈ పండుగను వైభవంగా సెలబ్రేట్‌ చేసుకున్నారు. వీరితో పాటు ప్రీతిజింటా, శిల్పాశెట్టి, రవీనాటాండన్‌, సోనమ్‌కపూర్‌ తదితర బాలీవుడ్ బ్యూటీలు తమ కుటుంబంతో కలసి కర్వాచౌత్ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు.

ఇదీ చదవండి: మహేష్ కొత్త లుక్ అదిరింది..!

Exit mobile version