Site icon Prime9

Mouni Roy: మౌని రాయ్ మొరను జక్కన్న ఆలకించనున్నారా?

rajamouli prime9news

rajamouli prime9news

Bollywood: ప్రస్తుతం సెలెబ్రెటీలకు ఉన్న క్రేజ్ ఎవరికి కూడా లేదు. వాళ్ళు అలా రోడ్ మీద కనిపిస్తే చాలు. 10నిముషాల్లో సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుంటుంది. అలాగే హీరోలు, హీరోయిన్స్ టాలెంటు ఉన్న ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేయాలనుకుంటారు. అలాంటి వారిలో మౌని రాయ్ కూడా ఒకరు. ఈ అమ్మడు మాత్రం నా రూటే సేపరెట్టు అంటుంది. తాజాగా ఈమె మన టాలీవుడ్ దర్శకుడు పైనా కన్నేసినట్టుంది. ఆ దర్శకుడు ఎవరు అని సందేహిస్తున్నారా, అతను ఎవరో కాదండీ మన జక్కన్న. మౌని రాయ్ నాగిని సీరియల్ తో తెలుగు ప్రేక్షకాధారణ పొందింది. ఈమె హిందీ సీరియ‌ల్స్‌, పలు సినిమాల్లో నటించింది. మౌనీ రాయ్ రీసెంట్‌గా బ్ర‌హ్మాస్త్ర సినిమాలో నెగిటివ్ షేడ్ పాత్ర‌లో న‌టించిన విషయం మన అందరికీ తెలిసిందే.

రీసెంట్‌గా బ్ర‌హ్మాస్త్ర సినిమా ప్రోమోషన్స్ లో భాగంగా మౌనీ రాయ్ జ‌క్క‌న్న‌ పై ఆమె ప్ర‌శంస‌ల వర్షం కురిపించింది. ఆమె రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌టానికి ఆసక్తిగా ఉన్నట్టు తెలిపింది. జక్కన్న దర్శకత్వం వహించిన సినిమాలన్ని చూశానని, ఆయ‌న డైరెక్ష‌న్ స్టైల్‌ నాకు బాగా నచ్చిందని తెలిపింది. మౌనీ రాయ్ మోర‌ను జ‌క్క‌న్న పట్టించుకొని ఆమెకు సినిమా అవకాశాలు ఇస్తారో లేదో చూడాలిసి ఉంది. తన సోష‌ల్ మీడియాలో గ్లామ‌ర‌స్ ఫొటోలు, వీడియోల‌తో హ‌ల్ చ‌ల్ చేసే మౌనీ రాయ్‌ పెళ్లి త‌ర్వాత కూడా ఆమె క్రేజ్ తగ్గలేదు.

Exit mobile version