Site icon Prime9

Amitabh Bachchan: బాలీవుడ్ అగ్ర హిరోకు రెండోసారి కరోనా..

Bollywood: బాలీవుడ్‌ అగ్ర హీరో అమితాబ్ బచ్చన్ రెండోసారి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ గారే ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసి తెలియజేశారు. అమితాబ్ బచ్చన్ గారు గేమ్‌షో  కౌన్ బనేగా కరోడ్‌పతి షూటింగ్ చేస్తున్నారు. షూటింగ్ చేస్తున్న సమయంలో కరోనా బారిన పడ్డట్లు తెలిసిన సమాచారం. ఆయన ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ గారు ట్వీట్‌ ద్వారా తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారందరూ తప్పకుండా కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. కరోనా బారిన పడ్డ విషయాన్ని తెలుసుకున్న  అమితాబ్ బచ్చన్ గారి ఫ్యాన్స్‌  ఒక్క సారిగా ఆందోళనకు గురి అయ్యారు. అంతేకాకుండా అమితాబ్ బచ్చన్ గారి అభిమానులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

అమితాబ్ బచ్చన్ గారికి రెండోసారి కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. ఇంతక ముందే  ఒకసారి ఈ బాలీవుడ్‌ అగ్ర హీరో అమితాబ్ బచ్చన్ గారు కరోనా బారిన పడ్డారు. అప్పుడు లక్షణాలు చాలా తక్కువ అని తెలిపారు. ఇప్పుడు మళ్ళీ కరోనా పాజిటివ్‌గా వచ్చే సరికి అందరూ ఆందోళన చెందుతున్నారు. త్వరలో అమితాబ్ బచ్చన్ గారు కోలుకోవాలని అభిమానుల ముందుకు వస్తానని ఆయన తెలిపారు. ఐతే అమితాబ్ బచ్చన్ గారు హోస్ట్‌గా చేస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి షూటింగ్ ఆగిపోతుందా ? జరుగుతుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ అంశం పై ఎలాంటి విషయాలు బయటి రాలేదు. అధికారిక సమాచారం ఇంకా రాలేదు. ఈ షో షూటింగ్ ఆగిపోతుందో లేక జరుగుతుందా అనేది ఇంకా ఏ విషయం కొలిక్కి రాలేదు.

గతేడాది 2021లో జూలై 11 తారీఖున అమితాబ్ బచ్చన్  కోవిడ్‌ వల్ల నానావతి ఆసుపత్రిలో చేరారు. అయితే అప్పుడు ఆయనతో పాటు అమితాబ్ బచ్చన్ గారి కుటుంబ సభ్యులు కూడా కరోనా బారిన పడ్డ విషయం మన అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం ముంబై నగరంలో కేసుల బాగా పెరుగుతున్నాయి. కావున తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.

Exit mobile version