Site icon Prime9

Aamir Khan: నిర్మాతలకు రూ 50 కోట్లు ఇస్తున్న అమీర్ ఖాన్

amir khan prime9news

amir khan prime9news

Bollywood: అమిర్‌ ఖాన్‌ హీరోగా నటించిన సినిమా ‘లాల్‌సింగ్‌ చడ్డా’. ఈ సినిమాకు ఓపెనింగ్ కలెక్షన్స్ కూడా రాలేదు. విడుదలైన మొదటి రోజే నుంచే ఈ సినిమాకు బ్యాడ్ టాక్ వచ్చింది. అదే ఈ సినిమాకు పెద్ద మైనస్ అయింది. ఇంక సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా కథ బాగాలేదని, అమీర్ ఖాన్ కు ఈ కథ సెట్ అవ్వలేదని అందుకే ఈ సినిమా ప్లాప్ అయిందని సినీ ఇండస్ట్రీలో టాక్ నడుస్తుందని తెలిసిన సమాచారం.

ఈ సినిమా ఆగస్ట్‌ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజే థియేటర్స్ కు జనాలు సరిగా రాలేదు. ఇంకా రెండో రోజు ఐతే థియేటర్స్‌ లో సీట్లు తప్ప మనుషులు కనపడలేదు. ఈ సినిమాను భారీ బడ్జెట్ రూ.180 కోట్ల తో ఈ సినిమాని నిర్మించారు. వరల్డ్ వైడ్ చూసుకుంటే ఈ సినిమా మొత్తం రూ.70 కోట్ల కలెక్షన్స్‌ మాత్రమే సాదించింది. ఈ సినిమా అమీర్ ఖాన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ప్లాప్ గా నిలిచింది. ఈ సినిమా నిర్మాతలు నష్టాల బాట పట్టారని కారణంగా అమీర్ ఖాన్ ఓ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. తాను తీసుకున్న రెమ్యూనరేషన్ రూ 50 కోట్లు వెనక్కి ఇవ్వడానికి సిద్ధపడ్డాడని తెలిసిన సమాచారం.

Exit mobile version