Site icon Prime9

Manoj Bajpayee : 14 ఏళ్లుగా రాత్రుళ్లు భోజనం చేయని బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్.. కారణం ఏంటంటే?

bollywood actor manoj bajpayee opens on his diet plan

bollywood actor manoj bajpayee opens on his diet plan

Manoj Bajpayee : ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌ సిరీస్‌తో ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ తెలుగు ప్రేక్షకులకూ పరిచయమే. బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. తెలుగులో సుమంత్ హీరోగా చేసిన ప్రేమ కథ సినిమాలో నటించారు. ఆ తర్వాత తెలుగు లోనూ అల్లు అర్జున్ , జెనీలియా జంటగా వచ్చిన ‘హ్యాపీ’… క్రిష్ దర్శకత్వంలో అల్లు అర్జున్ – మంచు మనోజ్ కలిసి నటించిన ‘ వేదం ‘ , పవన్ కళ్యాణ్ నటించిన ‘పులి’ సినిమాలతో ఆడియన్స్ కి మరింత చేరువయ్యారు. త్వరలో ఫ్యామిలీ మ్యాన్-3 షూటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన మీడియాతో సరదాగా ముచ్చటించారు.

అయితే మనోజ్ బీటౌన్‌లో నటుడిగా స్థిరపడేందుకు తొలినాళ్లలో చాలా కష్టాలు పడ్డట్లు ఇప్పటికే పలుమార్లు వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూ లో తొలిసారి అందరూ షాక్ అయ్యే విషయాన్ని బయటపెట్టారు. గత 13-14 ఏళ్లుగా తాను రాత్రుళ్లు భోజనం చేయట్లేదని చెప్పడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా అందుకు సంబంధించిన కారణాన్ని కూడా వెల్లడించాడు మనోజ్. అదేంటంటే.. మా తాతగారు సన్నగా, ఫిట్‌గా ఉండేవారు. కాబట్టి, ఆయన డైట్ ప్లాన్‌నే ఫాలో అవుదామని నిర్ణయించుకున్నాను. ఆ తరువాత క్రమంగా నా బరువు నియంత్రణలోకి వచ్చేసింది. నేను చాలా ఆరోగ్యంగా, ఎనర్జిటిక్‌గా ఫీలవుతున్నాను. మొదట్లో ఇలా రాత్రుళ్లు భోజనం మానుకోవడం కష్టంగా ఉండేది. కడుపులో ఆకలి కేకలు ఇబ్బంది పెట్టేవి. దీంతో, మంచి నీళ్లు తాగి, హెల్త్ బిస్కట్స్ తినేవాణ్ణి.. నా షెడ్యూల్‌కు అనుగుణంగా ఈ డైట్‌ ప్లాన్‌లో చిన్న చిన్న మార్పులు చేశాను. కొన్ని సార్లు 12 గంటలు, మరికొన్ని సందర్భాల్లో 14 గంటలు ఏమీ తినకుండా ఉండేవాణ్ణి అని ఆయన చెప్పుకొచ్చారు.

మొదట్లో ఈ ప్రాసెస్ కొనసాగించడం చాలా కష్టమైనట్లు తెలిపిన మనోజ్.. ఆకలిని చంపేందుకు ఎక్కువగా నీరు త్రాగడంతో పాటు కొన్ని ఆరోగ్యకరమైన బిస్కెట్లు తినేవాడినని వెల్లడించాడు. ఇలాంటి లైఫ్‌స్టైల్ అనుసరించడం వల్ల ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉంటాయని.. షుగర్, కొలెస్ట్రాల్, గుండె సంబంధిత వ్యాధులతో పాటు అనేక రోగాలకు దూరంగా ఉండవచ్చని చెప్పాడు. అయితే, ప్రతి రోజు రాత్రి ఏడు గంటల లోపు భోజనం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ రకంగా తక్కువ మోతాదులో రాత్రి భోజనం చేస్తే జీర్ణ వ్యవస్థ మెరుగవడంతో పాటూ శారీరక రుగ్మతలు దరిచేరవని చెబుతున్నారు. ఇక మనోజ్ సినిమాల విషయానికొస్తే.. కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’లో కనిపించనున్నాడు. ఈ మూవీ ట్రైలర్ ఇప్పటికే విడుదలైంది. ఇందులో ఒక శక్తివంతమైన బాబాపై పోరాడే లాయర్ పాత్రలో నటించిన మనోజ్.. సదరు బాబా చేతిలో దాడికి గురైన మైనర్‌కు న్యాయం చేయడం కోసం పోరాడతారు. కాగా.. ఈ చిత్రం మే 23న ZEE5లో ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుంది. ప్రస్తుతం మనోజ్ చేసిన ఈ వ్యాఖ్యలు బీ టౌన్ లో మంచి హాట్ టాపిక్ గా మారాయి.

 

Exit mobile version