Site icon Prime9

Madhubala Biopic: వెండితెరపై మధుబాల బయోపిక్

Bollywood: లెజెండరీ బాలీవుడ్ నటి మధుబాల బయోపిక్ వెండితెరపై రాబోతోంది. జీవితం ఆధారంగా, మధుబాల చెల్లెలు మధుర్‌ బ్రిజ్‌ భూషణ్‌ బ్రూయింగ్ థాట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తారు.

నా ప్రియమైన సోదరి కోసం ఏదైనా చేయాలనేది నా చిరకాల స్వప్నం. ఈ కలను సాకారం చేసుకోవడానికి నేను, నా సోదరీమణులందరూ చేతులు కలిపాము. భగవంతుని ఆశీస్సులు, నా భాగస్వాములు – అరవింద్‌జీ, ప్రశాంత్ మరియు వినయ్‌ల అంకితభావంతో ఈ బయోపిక్‌ను గ్రాండ్‌ లెవల్‌లో విజయవంతంగా రూపొందిస్తారన్న నమ్మకం నాకుంది. ఈ ప్రాజెక్ట్‌ను అందంగా తీర్చిదిద్దేందుకు అందరి దీవెనలు కావాలని బ్రిజ్ భూషణ్ అన్నారు.

బయోపిక్ వచ్చే ఏడాదికి సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. 1969లో మరణించిన మధుబాల 60కి పైగా చిత్రాలలో కనిపించారు. నటుడు దివంగత దిలీప్ కుమార్‌తో సన్నిహితంగా మెలిగిన మధుబాల అతనితో విడిపోయిన తర్వాత, ఆమె లెజెండరీ సింగర్ కిషోర్ కుమార్‌ను వివాహం చేసుకున్నారు.

Exit mobile version