Bichagadu 2: 2016లో తమిళంలో వచ్చిన ‘బిచ్చగాడు’ అప్పట్లో ఎంత సన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు లో కూడా రికార్డ్ కలెక్షన్లు అందుకుంది. బిచ్చగాడు కు కొనసాగింపుగా ‘బిచ్చగాడు 2’ తో హీరో విజయ్ ఆంటోని మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. విజయ్ ఆంటోని స్వీయ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా మే 19న విడుదలకు సిద్ధమైంది. గతంలో ఏప్రిల్ 14 నే విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. తాజాగా బిచ్చగాడు 2 ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
ట్రైలర్ ఎలా ఉందంటే..(Bichagadu 2)
ఇండియాలోనే 7 వ సంపన్నుడైన విజయ్ గురుమూర్తిగా విజయ్ ఆంటోని పరిచయం అవుతూ ట్రైలర్ మొదలవుతుంది. ఆ తర్వాత విజయ్ గురుమూర్తి హత్యకు గురి కావడం. గురుమూర్తిలో ఉండే సత్య అనే వ్యక్తి అందుకు కారణవుతున్నట్టు ట్రైలర్ లో చూపించారు. యాక్షన్ , థ్రిల్లింగ్ తో కూడిన పలు అంశాలతో ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ సినిమా కథను ఎక్కడా రివీల్ చేయకుండా మేకర్స్ జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపిస్తోంది. బిచ్చగాడు 2 లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందనే చెప్పుకోవచ్చు. ట్రైలర్ ను బట్టి విజయ్ ఆంటోని మరోసారి ఆకట్టుకునేలా కనిపిస్తున్నాడు. బిచ్చగాడు 2 కి ‘యాంటీ బికిలి’అనే ట్యాగ్ లైన్.
విజయ్ స్వీయ డైరెక్షన్ లో
కాగా, బిచ్చగాడు సినిమాకు శశీ దర్శకత్వం వహించారు. అయితే బిచ్చగాడు 2 కు ప్రియ కృష్ణస్వామి డైరెక్షన్ చేయాల్సి ఉండగా .. కొన్ని కారణాలతో ఆయన సినిమా నుంచి తప్పుకున్నారు. దీంతో విజయ్ ఆంటోని స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అదే విధంగా విజయ్ ఆంటోని ఫిల్మ్స్ కార్పోరేషన్ బ్యానర్ పై విజయ్ స్వయంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది.