Site icon Prime9

Pathaan Movie : షారూఖ్ “పఠాన్” ను వదలని వివాదాలు… మూవీ రిలీజ్ చేయొద్దంటూ మాల్ ను ధ్వంసం చేసిన భజరంగ్ దళ్

bhajarang dal members vandalises mall in ahmedabad for pathaan movie

bhajarang dal members vandalises mall in ahmedabad for pathaan movie

Pathaan Movie : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా… దీపిక పదుకొణే హీరోయిన్ గా నటించిన చిత్రం ‘పఠాన్’. జాన్ అబ్రహం ఈ సినిమాలో ముఖ్యపాత్రలో నటించనున్నారు. ఈ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చివరిగా షారుక్ ఖాన్ నటించిన జీరో సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా… సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. కాగా ఈ సినిమాలోని బేషరమ్ సాంగ్ వివాదాలకు కారణమైన విషయం తెలిసిందే.

ఈ సాంగ్ లో బికినిలో అందాల ఆరబోతతో రెచ్చిపోయింది దీపికా. దాంతో పలు అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అలాగే దీపికా కాషాయం రంగు బికినీ ధరించడంతో బీజీపీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మూవీని బాయ్ కాట్ చేయాలంటూ ప్రచారం జరిగింది. ఇటీవలే పఠాన్ సినిమాకు సెన్సార్ బోర్డు కూడా షాక్ ఇచ్చి.. ఆ పాటలో, పలు సీన్స్ లో మార్పులు చేయాలని సూచించింది. మరోవైపు ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఇంకా ఆగ్రహావేశాలు ఎక్కువవుతూనే ఉన్నాయి. సినిమాను నిషేధించాలని, కాదని విడుదల చేస్తే అడ్డుకుంటామంటూ ఇప్పటికే పలు హిందుత్వ సంఘాలతో పాటు పలువురు రాజకీయ నేతలు కూడా హెచ్చరించారు.

తాజాగా అహ్మదాబాద్‌లో బజరంగ్ దళ్ కార్యకర్తలు ఓ మాల్‌పై దాడి చేసి ధ్వంసం చేశారు. సినిమా విడుదలకు దగ్గర పడుతున్న తరుణంలో నగరంలోని అల్ఫావాన్ మాల్‌లోకి ప్రవేశించిన బజరంగ్ దళ్ కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. పఠాన్ సినిమా పోస్టర్లను చింపివేసి కాలితో తొక్కారు. సినిమాను విడుదల చేయొద్దని థియేటర్లను హెచ్చరించారు. బేషరం పాటతో హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ షారుఖ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. మరి ఈ వివాదాల మధ్య సినిమా రిలీజ్ పరిస్థితి ఏంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు.

Exit mobile version