Site icon Prime9

Bandla Ganesh: బూతు సినిమాల్లో ఎందుకు నటించానంటే.. బండ్ల గణేష్

Bandla ganesh

Bandla ganesh

Bandla Ganesh: తన సినిమాల కంటే ఎక్కువగా తన స్టేట్మెంట్ల కారణంగానే ఎప్పటికప్పుడు బండ్ల గణేష్ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఆడియో ఫంక్షన్ లో లేదా సినిమా ఈవెంట్లలో మాట్లాడుతూ ఇప్పటికే బండ్ల గణేష్ ఎన్నో వివాదాస్పద కామెంట్లు చేశారు. అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే బండ్ల గణేష పవర్ స్టార్ కు వీర భక్తుడు. ఆయన టాపిక్ వస్తే వీరావేశంతో మాట్లాడుతుంటారు. అయితే తనకు, పవన్ కు మధ్య త్రివిక్రమ్ శ్రీనివాస్ గ్యాప్ వచ్చేలా చేస్తున్నాడన్న అనుమానం బండ్ల గణేష్ లో ఏమూలో ఉంది.

ఈ విషయాన్ని ఒక చానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ప్రతిభను తాను చాలా కాలం క్రితమే గుర్తించానని.. పవన్ సామాన్యుడు కాదని తనకు ముందే తెలుసని.. ఇప్పుడు గురూజీ, బరూజీలు వచ్చారని పరోక్షంగా త్రివిక్రమ్‌ను ఉద్దేశించి బండ్ల గణేష్ అన్నారు. ఇక ఈ సందర్భంగా తన కెరీర్ మొదట్లో అశ్లీల చిత్రాల్లో నటించటంపై కూడా స్పందించారు బండ్ల గణేష్.

నిజానికి అలాంటి సినిమాల్లో తాను నటించాలని అనుకోలేదని.. హీరో పాత్ర అని నిర్మాత నట్టి కుమార్ చెప్తే అలాంటి సినిమా ఒప్పుకున్నట్లుగా తెలియజేశాడు.అయితే ఆ సినిమా షూటింగ్ మొదలైన తర్వాత కానీ అసలు విషయం అర్థం కాలేదని.. బాడీని ఏదో పైకి కిందకి అంటే సరిపోతుంది అని ఏదో మాట్లాడి ఆ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేయించాడు అని.. ముందే తెలిసి ఉంటే అలాంటి సినిమా చేయకపోయేవాడిని అని బండ్ల గణేష్ తెలిపారు.

 

 

 

Exit mobile version