Site icon Prime9

Balakrishna : స్వామి రామానుజాచార్యగా బాలకృష్ణ

Balakrishna

Balakrishna

Tollywood News:: నందమూరి బాలకృష్ణ తన 109వ చిత్రాన్ని ఈరోజు ప్రారంభించారు. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదే సమయంలో బాలయ్య మరో ప్రాజెక్ట్ గురించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చింది.తన దశాబ్దాల కెరీర్‌లో నందమూరి బాలకృష్ణ పౌరాణిక మరియు పురాణ చిత్రాలను కూడా చేసారు. వాటిలో శ్రీరామ రాజ్యం మరియు పాండురంగ మహత్యం వంటివి ప్రేక్షకులను బాగా ఆకర్షించాయి.

తాజాగా బాలయ్య వేదాంతంలోని విశిష్టాద్వైతాన్ని ప్రబోధించిన స్వామి రామానుజాచార్య జీవితాన్ని తెరకెక్కించాలని ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఇందులో రామానుజాచార్య గా బాలయ్య నటిస్తారు. బాలయ్య దీనికి సంబంధించిన సమాచారాన్ని అంతా సేకరిస్తున్నట్లు కూడ తెలుస్తోంది.

గతంలో బాలయ్యతో పరమ వీర చక్ర, రూలర్, జైసింహా వంటి చిత్రాలను నిర్మించిన నిర్మాత సి కళ్యాణ్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తారని,కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించబోతున్నారని టాక్ . , ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ విషయంలో ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామి సహాయం చేయనున్నారు. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన విడుదల కావలసి ఉంది.

Exit mobile version