Site icon Prime9

Ayushmann Khurrana: బిఎస్ఎఫ్ సైనికులతో ఒక రోజంతా గడిపిన ఆయుష్మాన్ ఖురానా

Bollywood: బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా జమ్మూలో బిఎస్ఎఫ్ సైనికులతో ఒక రోజంతా గడిపాడు . దీనికి సంబంధించి ఒక వీడియోను షేర్ చేసుకున్నాడు .ఆయుష్మాన్ జవాన్లతో కలిసి వర్కవుట్ చేస్తూ, జాగింగ్ చేస్తూ, క్రికెట్ ఆడుతూ కనిపించాడు. ఆ తర్వాత జమ్మూలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఫ్రాంటియర్ హెడ్ క్వార్టర్ కు వెళ్లి అక్కడ డ్యాన్స్ చేస్తూ మొక్కను నాటాడు. “స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు” అనే సందేశంతో వీడియో ముగుస్తుంది.

క్యాప్షన్ కోసం, అతను ఇలా రాసాడు. స్పూర్తిదాయకమైన కథలు. శాశ్వతమైన జ్ఞాపకాలు. మాటల్లో చెప్పలేనంత కృతజ్ఞతలు. జై హింద్. నటుడు ఆయుష్మాన్ త్వరలో ‘యాన్ యాక్షన్ హీరో’ ‘డాక్టర్ జి’ చిత్రాలలో కనిపించనున్నాడు.

Exit mobile version