Raveena Tandon: బాలీవుడ్ నటి రవీనా టాండన్‌పై ఆమె ఇంటి వద్ద ఓ పెద్ద గుంపు దాడికి తెగబడింది. తనను కొట్టవద్దని ఆమె వేడుకోవడం వీడియోలో వినిపించింది. ఆ వీడియో క్లిప్‌లో రవీనా టాండన్‌పై కొంత మంది మహిళలు దాడి చేయడం కనిపించింది. దాడి చేసిన మహిళలు మాత్రం రవీనా.. ఆమె డ్రైవర్ ఇద్దరు కలిసి ముగ్గురు మహిళలపై దాడి చేశారని వారిలో ఒక వృద్ద మహిళ కూడా ఉన్నారని ఆరోపిస్తున్నారు.
రవీనా డ్రైవర్ నిర్లక్ష్యంగా కారు నడిపాడని..(Raveena Tandon)
ఇక అసలు విషయానికి వస్తే ఈ నెల 1వ తేదీ రాత్రి రవీనా టాండన్‌ను ఆమెను డ్రైవర్ ఇంటికి తీసుకువస్తున్న సందర్భంగా డ్రైవర్ నిర్లక్ష్యంగా కారు నడిపి పలువురిని గాయపర్చాడని చెబుతున్నారు. కాగా ఈ ఘటన ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని కార్డర్ రోడ్డు వద్ద జరిగింది. రవీనా టాండన్ డ్రైవర్ నిర్లక్ష్యంగా కారు నడపి కార్డర్ రోడ్డులో ముగ్గురిని గాయపర్చాడని.. రిజ్వీ కాలేజీ దగ్గర కారు రివ్సల్ తీసుకుంటున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని చెబుతున్నారు. ఇక వీడియో క్లిప్‌ను బట్టి చూస్తే రవీనా టాండన్‌ను ఓ మహిళా గుంపు దాడి చేసింది. కాగా ఈ మహిళ గ్రూపు చెప్పేది ఏమిటంటే రవీనా, ఆమె డ్రైవర్‌కలిసి ముగ్గురు మహిళలపై దాడి చేశారని ఆరోపిస్తున్నారు. కాగా ఇదే వీడియోలో ఓ బాధితుడు రవీనాను ఈ రాత్రి అంతా నువ్వు జైల్లో ఉండాల్సిందే అంటూ గట్టిగా అరిచాడు. తన ముక్కు నుంచి రక్తం కారుతోందని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
రవీనాను తోసేసి… దాడి చేసిన గుంపు.
ఇదిలా ఉండగా రవీనా కారును గుంపు చుట్టుముట్టగా ఆమె కారు నుంచి బయటికి వచ్చి గుంపుతో మాట్లాడాలనుకున్నారు. ఆమె కారు నుంచి దిగగానే ఆమె తోసేసి కొట్టడం కూడా జరిగింది. అయితే రవీనా తనను నెట్టొద్దు.. దయచేసి కొట్టకండని వేడుకున్నారు. అదే సమయంలో అక్కడ కెమెరా నుంచి చూసిన ఆమె ఆ వ్యక్తిని షూట్ చేయవద్దని కోరారు. కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అయ్యింది. దీనికి సంబంధించి ఆమె ఇంకా స్టేట్‌మెంట్ ఇవ్వలేదు.ఈ సంఘటన జరిగిన తర్వాత ఇరువర్గాల వారు ఖార్ పోలీసుస్టేషన్ చేరుకొని ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నాడు.తర్వాత ఇరు వర్గాల వారు ఒక ఒప్పందానికి వచ్చి ఫిర్యాదు ఉపసంహరించుకున్నారు. కాగా పోలీసులు మాత్రం డ్రైవర్ మద్యం మత్తులో లేడని, కారు రివర్స్ తీసుకుంటున్నప్పుడు కూడా ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు. కాగా రవీనా టాండన్‌కు మద్దతుగా బాలీవుడ్ క్వీన్ కంగనరనౌత్ అండగా నిలిచారు. రవీనాపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.