AR Rahman: ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ , ఆయన సతీమణి సైరా భాను పై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. ఈ చర్చ కారణం లేకపోలేదు. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ అవార్డుల ఫంక్షన్ లో రెహమాన్ , ఆయన భార్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైరా భాను ను హిందీలో కాకుండా తమిళంలో మాట్లాడాలని రెహమాన్ కోరాడు. అయితే ఆమె తమిళం మాట్లాడానికి ఇబ్బంది పడింది. అదే విధంగా తనకు తమిళం సరిగా రాదని సమాధానమిచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. ఇదే సమయంలో రెహమాన్ ను కూడా విపరీతంగా ట్రోల్ చేశారు.
காதலுக்கு மரியாதை🌺😍 https://t.co/8tip3P6Rwx
— A.R.Rahman (@arrahman) April 27, 2023
కస్తూరి కామెంట్స్.. రెహమాన్ రిప్లై(AR Rahman)
అయితే , ఇదే విషయంపై తమిళ నటి కస్తూరి స్పందించింది. రెహమాన్ భార్య సైరా భానుపై కామెంట్స్ చేశారు. ‘ ఏమిటీ? ఏఆర్ రెహమాన్ భార్యకు తమిళం రాదా? ఆమె మాతృభాష ఏంటీ? ఇంట్లో వాళ్లు ఏ భాషలో మాట్లాడుకుంటారు? ’ అంటూ ట్వీట్ చేశారు. కాగా, కస్తూరి కామెంట్స్ పై రెహమాన్ కూడా స్పందించారు. ‘ నా ప్రేమను గౌరవిస్తా’ అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం వీళ్లద్దరి ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక పోతే ఏఆర్ రెహమాన్ సినిమాల విషయానికొస్తే ‘మామన్నన్’, ‘మైదాన్’, ‘పిప్పా’, ‘లాల్ సలామ్’చిత్రాలకు ప్రస్తుతం సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు.