AR Rahman: విడాకుల ప్రకటన తర్వాత ఫస్ట్‌టైం మీడియా ముందుకు ఏఆర్‌ రెహమాన్‌ – డిప్రెషన్‌పై ఏమన్నారంటే..!

  • Written By:
  • Updated On - November 29, 2024 / 12:17 PM IST

AR Rahman Talk About Depression After Divorce: విడాకులు తర్వాత మొదటి సారి ఏఆర్ రెహమాన్ మీడియా ముందుకు వచ్చారు. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఇంటర్నేషన్‌ ఫిల్మ్‌ ఫెస్టివర్‌ ఆప్‌ ఇండియా(IFFI) వేడుకలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విడాకులు, డిప్రెషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న ఈ ఈవెంట్‌ ముంగిపు వేడుకలను జరుపుకుంది. దీనికి ఏఆర్‌ రెహమాన్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మానసిక ఒత్తిడిపై చర్చించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం చాలామంది డిప్రెషన్‌ సమస్యతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. ” ఈ రోజుల్లో ఎంతోమంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఎందుకంటే తమ జీవితంలో ఏదో ముఖ్యమైన దానిని కోల్పోతున్నామనే భావనతో డిప్రెషన్‌కి వెళుతున్నారు. అయితే దానిని చదవడం, రాయడం, లేదా సంగీతం విడనడం ద్వారా ఆ శూన్యత నుంచి బయటపడోచ్చు. కానీ ప్రజలు ఒక్కటి తెలుసుకోవాలి.

మనుషులు తమ ప్రాథమిక కోరికలను (శృంగారం) నియంత్రించుకోవడం తెలుసుకోవాలి. ఎందుకంటే వాటికంటే కూడా జీవితంలో చాలా ముఖ్యమైన ఉన్నాయి. ఆ విషయం ఎవరికి తెలియడం లేదు. నచ్చిందని దొరకనప్పుడు ఏదో కోల్పోతున్నామనే భ్రమలో ఉంటున్నారు. కనీసం దాని నుంచి ఎలా బయటపడాలో ఎవరికీ తెలియడం లేదు. మనకు ఇష్టమైన సంగీతం వినడం, వినోదాన్ని ఇచ్చే వాటిపై దృష్టి పెట్టడం వల్ల ఈ మానసిక ఒత్తిడిని దరిచేరకుండ చెయొచ్చు” అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఇటీవల అక్స్‌ఫర్డ్‌ విద్యార్థులతో ముచ్చటించిన సందర్బంగా ఏఆర్‌ రెహమాన్‌ తన చిన్నతనంలో ఎదురైన సంఘటనలను గుర్తుచేసుకున్నారు.

టీనేజ్‌లో ఉన్నప్పుడు తను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్టు చెప్పారు. అయితే ఆ సమయంలో తన తల్లి ఇచ్చిన సలహా తన జీవితాన్నే మార్చేసింది, అప్పటి నుంచి జీవితాన్ని మరోలా చూడటం నేర్చుకున్నానని చెప్పారు. “యవ్వనంలో నేను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు. అప్పుడు మా అమ్మ ‘నీ కోసం కాకుండా ఇతరుల కోసం జీవించినప్పుడు ఇలాంటి ఆలోచనలు రావు’ అని చెప్పారు. అప్పటి నుంచి నా ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. ఒకరి గురించి ఆలోచించడం, ఒకరి కోసం కంపోజ్ చేయడం లేదా ఆహారాన్ని పంచుకోవడం వంటి దయతో కూడిన చర్యలు మనల్ని ప్రజలతో ముందుకు సాగడంలో సహాయపడతాయి” అని చెప్పుకొచ్చారు.