Site icon Prime9

Anupama Parameswaran : నా ఏజ్ లో ఉన్న వాళ్ళు కొంతమంది పెళ్లిళ్లు చేసుకుంటున్నా.. నేను మాత్రం అంటున్న మలయాళీ బ్యూటీ

anupama parameswaran latest post goes viral on media

anupama parameswaran latest post goes viral on media

Anupama Parameswaran : మలయాళం సినిమా ప్రేమమ్ తో ప్రేక్షకులను పరిచయమై.. తెలుగు ప్రేమమ్ తో వారిని మరింత మెస్మరైజ్ చేసింది “అనుపమ పరమేశ్వరన్”. ఆ తర్వాత తెలుగులో అఆ, రౌడీ బాయ్స్, కార్తికేయ 2, 18 పేజీస్ సినిమాలలో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు లోనే కాకుండా.. తమిళ్, మలయాళ ఇండస్ట్రీలోనూ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇక అనుపమ ప్రస్తుతం డీజే టిల్లు సీక్వెల్ లో నటిస్తుంది. మరోపక్క ప్రస్తుతం టిల్లు స్క్వేర్ సినిమాలో బిజీగా ఉన్న అనుపమ.. సోషల్ మీడియా లోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది.

అనుపమ సోషల్ మీడియాలో పెట్టే ఫోటోలు, వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి. తాజాగా అనుపమ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ లో.. నా ఏజ్ లో ఉన్న వాళ్ళు కొంతమంది పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కొంతమంది పిల్లలు కంటున్నారు. కానీ నేను మాత్రం ఇంకా బయటకి వెళ్లాలంటే ఇంట్లో పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది అని సరదాగా పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

Anupama Parameswaran Interesting post on her age People post goes viral

అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో అనుపమ మీద చాలా ట్రోల్స్, మీమ్స్ వస్తున్నాయి. ఇందుకు ముఖ్య కారణం అంటే ప్రతి సినిమాలో లిప్ లాక్ సీన్ లో నటించడమనే చెప్పాలి. రౌడీ బాయ్స్ కోసం ఆశిష్‌తో లిప్ లాక్ చేసిన ఈ బ్యూటీ.. డీజే టిల్లు స్క్వేర్ ప్రోమోలో  లిప్ లాక్ ఇవ్వడంతో మీమ్స్, ట్రోల్స్ వస్తున్నాయి.

Exit mobile version
Skip to toolbar