Site icon Prime9

Anupama Parameshwaran: డీజే టిల్లు సీక్వెల్ లో అనుపమ పరమేశ్వరన్

Tollywood: డీజే టిల్లు సూపర్ హిట్ కావడంతో సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం సీక్వెల్‌ కు శ్రీకారం చుట్టాడు. షూటింగ్ అతి త్వరలో ప్రారంభమవుతుంది. సిద్ధు నటీనటులు, సిబ్బందిలో మార్పులు చేసాడు. ఈ సీక్వెల్‌కి విమల్ కృష్ణ స్థానంలో మల్లిక్ రామ్ దర్శకుడిగా మారారు. డీజే టిల్లులో నేహా శెట్టి కథానాయికగా నటించింది. ఆమె చిత్రానికి ఎసెట్. ఇప్పుడు సీక్వెల్‌లో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుంది. ఆమె ఇటీవలే ఈ చిత్రానికి సంతకం చేసింది.

ఆగస్ట్‌లో షూటింగ్‌ని ప్రారంభించాలని భావించారు. కాని ఆలస్యమైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఎస్ నాగవంశీ డిజె టిల్లు 2ని నిర్మించనున్నారు. ఈ చమత్కారమైన ఎంటర్‌టైనర్ కోసం సిద్ధు జొన్నలగడ్డ స్క్రిప్ట్ మరియు డైలాగ్ వెర్షన్‌కు పనిచేశారు. సిద్ధూ తన ఇతర ప్రాజెక్ట్‌లన్నింటినీ ప్రస్తుతానికి హోల్డ్‌లో ఉంచాడు డీజే టిల్లు 2 పై దృష్టి పెట్టాడు.

Exit mobile version