Site icon Prime9

Anupam Kher: జయప్రకాష్ నారాయణ్ గా అనుపమ్ ఖేర్

Bollywood: కంగనా రనౌత్ నటిస్తున్న ’ఎమర్జెన్సీ‘ నుండి అనుపమ్ ఖేర్ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ చిత్రంలో అతను లోక్క్ష్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ పాత్రను పోషిస్తున్నారు. 1970లలో ఇందిరా గాంధీకి నారాయణ్ ప్రధాన ప్రత్యర్ది. అందువలన ’ఎమర్జెన్సీ‘లో ఈ పాత్ర కీలకంగా వుంటుంది.

ఇందిరా గాంధీ దేశ ప్రధానిగా వున్నపుడు విధించిన ఎమర్జెన్సీని ఆధారంగా తీసుకుని ఈ చిత్రం తెరకెక్కుతంది. ఈ నెల ప్రారంభంలో, చిత్రం నుండి ఒక చిన్న వీడియో కంగనా రనౌత్ యొక్క ఇందిరా గాంధీని పాత్రని ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఈ చిత్రానికి కంగనా రనౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆమె బ్యానర్ మణికర్ణిక ఫిల్మ్స్ ఎమర్జెన్సీని నిర్మిస్తోంది. కంగనా రనౌత్ రాబోయే చిత్రాలలో తేజస్ మరియు మణికర్ణిక సీక్వెల్ ఉన్నాయి. ఆమె తన బ్యానర్‌ పై టికు వెడ్స్ షేరును కూడా నిర్మిస్తోంది.

Exit mobile version