Site icon Prime9

Varshini: పెళ్లిపీటలెక్కనున్న ప్రముఖ యాంకర్

tv anchor varshini getting marriage

tv anchor varshini getting marriage

Varshini: బుల్లితెరపై చాలా మంది స్టార్ యాంకర్స్ గా రాణిస్తున్నారు. వారిలో ఒకరు వర్షిణి. తనదైన చలాకీతనంతో అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. కాగా ఈమె పలు టీవీషోలలో యాంకర్ గా రాణిస్తున్నారు. హీరోయిన్ గాను ఒకటి రెండు సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.
అయితే తనదైన నటనాశైలితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల భామ త్వరలో పెళ్లిపీటలెక్కనున్నట్టు సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తుంది.

వెండితెరపై ఏమాత్రం గుర్తింపు రాకపోయినా బుల్లితెర పై పలు కార్యక్రమాల ద్వారా అభిమానులను సంపాధించుకున్న ఈ చిన్న ఇటీవలె బుల్లితెర పై కూడా పెద్దగా కనిపించడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ ఉంటుంది. రోజూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఫొటోల ద్వారా నెట్టింట యాక్టివగ్ ఉంటుంది ఈ భామ. అయితే సోషల్ మీడియాలో ఎంతగా అందాలు ఆరబోసినా అవకాశాలు మాత్రం రాకపోవడం వల్ల వర్షిణి పెళ్లిపీటలెక్కలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ కావాలని నిర్ణయించుకుందట. అయితే వర్షిణి ఎవరిని పెళ్లి చేసుకోబోతుందనే ఆసక్తి అభిమానుల్లో ఉంది. కాగా తనకు వరుసకు బావ అయ్యే వ్యక్తిని ఈ బ్యూటీ పరిణయమాడబోతుందని తెలుస్తోంది. చిన్నప్పటి నుంచి వీరి తల్లిదండ్రులు వీరిద్దరికీ పెళ్లి చేయాలని కూడా భావించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే వర్షిణి తన బావతో కలిసి ఏడు అడుగులు వేయనుందని అంటున్నారు. త్వరలోనే వర్షిణి పెళ్లి కి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న “బింబిసార”.. ఈనెల 7 నుంచే స్ట్రీమింగ్

Exit mobile version