Site icon Prime9

Anchor Suma : మీడియాకు క్షమాపణలు చెప్పిన యాంకర్ సుమ.. ఎందుకంటే..!

anchor suma apologies to media over aadikeshava movie event issue

anchor suma apologies to media over aadikeshava movie event issue

Anchor Suma : యాంకర్ సుమ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు. బుల్లితెరపై, సినిమా ఫంక్షన్ల లోనూ తనదైన శైలిలో దూసుకుపోతూ టాప్ యాంకర్ గా కొనసాగుతున్నారు సుమ. తన కామెడీ టైమింగ్ తో అందర్నీ నవ్విస్తుంటుంది  ఈమె. అయితే తాజాగా ఒక ఈవెంట్ లో సుమ కామెడీగా చేసిన కొన్ని వ్యాఖ్యలు విలేకర్లకు కోపం తెప్పించింది. దీంతో ఆమె సారీ చెబుతూ ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..?

మెగా హీరో వైష్ణవ్ తేజ్, యంగ్ బ్యూటీ శ్రీ లీల కలిసి నటిస్తున్న చిత్రం “ఆదికేశవ”. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ యాక్టర్ ‘జోజు జార్జ్’ విలన్ గా  కనిపించబోతున్నాడు. తమిళ సంగీత దర్శకుడు జి వి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఈ సినిమాని సంయుక్త నిర్మిస్తుండగా శ్రీకర స్టూడియోస్ చిత్ర సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ.. పలు కారణాల రీత్యా ఆలస్యం అవుతూ వస్తుంది. కొత్త విడుదల తేదీన త్వరలోనే అనౌన్స్ చేస్తామని మూవీ యూనిట్ ప్రకటించింది. ఇక ఇటీవలే టీజర్ ని రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్ కి తెరలేపారు.

ఈ మేరకు సినిమాలోని “లీలమ్మో” సాంగ్ లాంచ్ ఈవెంట్ రీసెంట్ గా ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లోనే సుమ మాట్లాడుతూ.. ‘బయట స్నాక్స్ ని భోజనంలా చేస్తున్న వారు లోపలి రావాలి’ అని విలేఖర్లని ఉద్దేశిస్తూ మాట్లాడింది. ఇక ఈ కామెంట్స్ కి మీడియా ప్రతినిథులంతా ఫీల్ అయ్యారు. ఈ విషయాన్ని అక్కడే సుమని ప్రశ్నించగా.. ఆమె కూడా స్టేజి పై నుంచే సారీ చెప్పింది. అదే విధంగా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని రిలీజ్ చేశారు.

ఆ వీడియోలో తన వ్యాఖ్యలు మీడియా వారిని ఇబ్బంది పెట్టాయని తనకు అర్థమవుతోందని విచారం వ్యక్తం చేశారు. నిండు మనసుతో క్షమాపణ కోరుతున్నానని అన్నారు. మీడియావారు ఎంత కష్టపడి పనిచేస్తారో తనకు తెలుసునన్నారు. ‘ మీరు, నేను కలిసి కొన్నేళ్ల నుంచి ప్రయాణిస్తున్నాం. నన్ను ఓ కుటుంబ సభ్యురాలిగా భావించి క్షమిస్తారని ఆశిస్తున్నా’ అని తెలియజేస్తూ యాంకర్ సుమ ఒక వీడియో విడుదల చేశారు.

 

Exit mobile version