Site icon Prime9

Anchor Suma:యాంకర్‌ సుమ కీలక పాత్రలో ‘ప్రేమంటే’ – ప్రియదర్శి హీరోగా రానా సమర్పణలో కొత్త మూవీ

Anchor Suma and Priyadarshi Premante Movie launch: యాంకర్‌ సుమ.. బుల్లితెరపై ఆమెకు ఉన్న క్రేజ్‌ గురించి తెలిసిందే. స్టార్‌ హీరోయిన్లకు మించిన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది ఆమెకు. ఆడియన్స్‌ మాత్రమే కాదు ఇండస్ట్రీలోని వర్గాలు కూడా ఆమెకు అభిమానులమే అంటారు. బుల్లితెరపై యాంకర్‌గానే కాదు స్టార్‌ హీరో ప్రీ రిలీజ్‌ ఈవెంట్స్‌, ప్రముఖ సినిమా కార్యక్రమాలకు ఆమె హోస్ట్‌. సుమ లేనిదే ఏ స్టార్‌ హీరో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఉండదు. ఆమెతో ప్రమోషన్‌ లేకుండ సినిమా రిలీజ్‌ అవ్వదు. అంతగా తన వాక్చాతుర్యం, కామెడీ పంచ్‌లతో ప్రత్యేకమైన ఇమేజ్‌ సంపాదించుకంది ఆమె.

యాంకర్‌గానే కాదు సమయంలో వచ్చినప్పుడల్లా నటిగా వెండితెరపై కూడా అలరిస్తోంది. రెండేళ్ల క్రితమ ఆమె ప్రధాన పాత్రలో జయమ్మ పంచాయతీ అనే సినిమా వచ్చింది. లాక్‌డౌన్‌ తర్వాత వచ్చిన ఈ సినిమా థియేటర్లో విడుదలైంది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. సినిమాకి మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చిన సుమ నటనకు మాత్రం ప్రశంసలు కురిశాయి. విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఇక ఈ మూవీతో ఆమె మరో సినిమాను ప్రకటించలేదు. అంతేకాదు సహానటిగాను కనిపించలేదు.

అయితే ఆమెను మరోసారి వెండితెరపై చూడాలని ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్‌ న్యూస్‌. సుమ మరోసారి వెండితెరపై అలరించేందుకు రెడీ అయ్యింది. ఆమె కీలక పాత్రలో తాజాగా కొత్త సినిమా ప్రకటన వచ్చింది. కమెడియన్‌ ప్రియదర్శి హీరోగా లవ్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ చిత్రంలో సుమ కీలక పాత్ర పోషిస్తోంది. యువ నటి ఆనంది ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి ప్రేమంటే టైటిల్‌తో అధికారిక ప్రకటన వచ్చింది. ఈ రోజే (జనవరి 18) ఈ చిత్రం గ్రాండ్‌గా లాంచ్‌ అయ్యింది. హైదరాబాద్‌లో పూజ కార్యక్రమాన్ని జరుపుకుంది. స్టార్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా, హీరో రానా ముఖ్య అతిథుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముహుర్తపు తొలి సన్నివేశానికి రానా తొలి క్లాప్ కొట్టాగా.. సందీప్‌ రెడ్డి వంగా కెమెరా స్విచాన్‌ చేశారు. రానా సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, స్పిరిట్‌ మీడియా బ్యానర్లపై జాన్వి నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థ్రిల్లింగ్‌ రొమాంటిక్ డ్రామా వస్తున్న ఈ సినిమాతో నవనీత్‌ శ్రీరామ్‌ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. లియోన్ జేమ్స్‌ మూవీకి సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుకానుందని ఈ సందర్భంగా మేకర్స్‌ తెలిపారు.

Exit mobile version