Site icon Prime9

Anasuya : విజయ్ దేవరకొండపై పరోక్షంగా సెటైర్లు వేసిన యాంకర్ అనసూయ.. ట్రెండింగ్ లో “ఆంటీ”

anchor anasuya post got viral on social media

anchor anasuya post got viral on social media

Anasuya : బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా ఎంతో పేరు సంపాదించుకుంది అనసూయ. ఇప్పుడు బుల్లితెరకు గుడ్ బై చెప్పేసి పూర్తిగా సినిమాలతో బిజీగా ఉంటుంది. తాజాగా ఈమె కూడా నటించిన “రంగమార్తాండ” సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో అనసూయ పాత్రకు కూడా మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు. అయితే సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ ఏదో ఒక అంశంపై స్పందిస్తూ నిత్యం వార్తల్లో ఉంటూ ఉంటారు అనసూయ. ముఖ్యంగా ఏమి లేని విషయాన్ని కూడా అనసూయ స్పందించి కావాలనే ఇష్యూ చేస్తుందని నెటిజన్లు ఆమెను ఆంటీ అంటూ ట్రోల్స్ చేస్తూ ఉంటారు.

అయితే ఇప్పుడు తాజాగా ఆమె చేసిన పోస్ట్ కారణంగా మళ్ళీ ఆమెపై నెటిజన్లు విపరీతంగా విరుచుకుపడుతున్నారు. ఇంతకీ విషయం ఏంటి అంటే.. యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు, అన‌సూయకు  మధ్య ఎప్ప‌టి నుంచో మాట‌ల యుద్ధం జ‌రుగుతుంది. వీరిద్దరి మధ్య ఈ మాట‌ల యుద్ధం ఇప్ప‌టిదీ కాదు. అర్జున్ రెడ్డి స‌మ‌యం నుంచి జ‌రుగుతుంది. ఆ సినిమా రిలీజ్ స‌మ‌యంలో వాడిన ఓ బూతు పదంపై మన స్టార్ యాంకర్ విమర్శలు చేసింది. దానికి విజయ్ దేవరకొండ సైతం ఆమెపై విమర్శలు చేశాడు. ఆ తర్వాత లైగర్ సినిమా రిలీజ్ తర్వాత కూడా ఇది కొనసాగింది. లైగర్ ఫ్లాప్ అయినప్పుడు కూడా అనసూయ, విజయ్ దేవరకొండను టార్గెట్ చేసింది. అప్పుడు రౌడీ స్టార్స్ ఫ్యాన్స్ అనసూయపై విరుచుకుపడింది. ఆమె కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీమరోసారి విజయ్ దేవరకొండను అనసూయ భరద్వాజ్ టార్గెట్ చేసింది.

అందుకు కార‌ణం.. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తోన్న చిత్రం ‘ఖుషి’. సమంత హీరోయిన్. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ పోస్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. ఆ పోస్ట‌ర్‌లో హీరో హీరోయిన్ల పేర్లు వేశారు మేక‌ర్స్‌. అంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే అందులో విజ‌య్ దేవ‌ర‌కొండ పేరు ముందు ‘ది’ అని రాశారు. అయితే అలా రాయటాన్ని అనసూయ పరోక్షంగా విమర్శించింది.

ఈ మేరకు ట్విట్టర్ లో ‘బాబోయ్ ‘ది’ అంట.. పైత్యం.. అంటకుండా చూసుకుందాం’ అని పోస్ట్ చేసింది. దీంతో రౌడీ బాయ్ విజయ దేవరకొండ ఫ్యాన్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. యూత్ లో అతనికి ఉన్న హై క్రేజ్ గురించి తెలిసిందే. దీంతో వాళ్ళంతా అన‌సూయ‌ను ట్రోల్ చేయ‌టం స్టార్ట్ చేశారు. అయితే అన‌సూయ కూడా త‌గ్గేదే లే అనేలా రియాక్ట్ అయ్యింది. ‘‘భలే రియాక్ట్ అవుతున్నార్రా! ఎక్క‌డో నేను చెప్పింది క‌రెక్ట్ అని ప్రూవ్ చేస్తున్నారు’ అంటూ మళ్లీ ట్వీట్స్ చేసింది అనసూయ. మరి ఈ ట్విట్టర్ వార్ ఎప్పుడు ఆగుతుందో.. దీనిపై ఎవరు తగ్గుతారో అనేది తెలియాలంటే.. మరింత సేపు వేచి చూడక తప్పదు.

 

 

Exit mobile version