Site icon Prime9

Amitabh Bachchan: అల్లు అర్జున్‌తో నన్ను పోల్చకండి: అమితాబ్‌ బచ్చన్‌

Amitabh Bachchan About Allu Arjun: బాలీవుడ్‌ బిగ్‌బి మరోసారి అల్లు అర్జున్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యాత వ్యవహరిస్తున్న ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’. లేటెస్ట్‌ ఎపిసోడ్‌లో కోల్‌కతాకు చెందిన రజనీ బర్నివాల్‌ మహిళ కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఈ సందర్భంగా అమితాబ్‌తో అల్లు అర్జున్‌ పోల్చింది. తనకు అమితాబ్‌ బచ్చన్‌ ఇంకా అల్లు అర్జున్‌ అంటే ఇష్టమని, మీ ఇద్దరికి వీరాభిమానిని అని చెప్పింది. ఆమె కామెంట్స్‌పై దీనికి బిగ్‌బి స్పందిస్తూ.. “అతనితో నన్ను పోల్చకండి.

ప్రస్తుతం అల్లు అర్జున్‌కు దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. నేను కూడా ఆయనకు వీరాభిమానిని. అద్భుతమైన ప్రతిభ కలిగిన నటుడు. అతడికి వచ్చిన ఈ గుర్తింపు పూర్తి అర్హుడు. రీసెంట్‌గా ఆయన నటించిన పుష్ప 2 విడుదలైంది. సూపర్‌ హిట్‌ అందుకుంది. ఈ సినిమా మీరు ఇంకా చూడకపోతే వెంటనే చూసేయండి. అతనిలో చాలా ప్రతిభ దాగుతుంది” అంటూ బన్నీపై ప్రశంసలు జల్లు కురిపించారు. ప్రస్తుతం బిగ్‌బీ కామెంట్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. నేషనల్‌ ఛానల్‌ వేదికపై ఆయన ఈ కామెంట్స్‌ చేయడంతో దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు.

బిగ్‌బీ కామెంట్స్‌ అనంతరం సదరు మహిళ ఇలా చెప్పుకొచ్చింది. వెండితెరపై మీ ఇద్దరి మ్యానరిజం ఒకేలా ఉంటుంది. కొన్ని సీన్స్‌ ఒకేలా చేస్తారు. ముఖ్యంగా కామెడీ సీన్స్‌లో మీ ఇద్దరు కాలర్‌ కొరుకుతూ, కళ్లు కొడతారని చెప్పింది. దీనికి బిగ్‌బీ తాను ఎప్పుడలా చేశానని తిరిగి ప్రశ్నించారు. అమర్‌ అక్భర్‌ ఆంటోనీ చిత్రంలో చేశారని గుర్తు చేసింది. అదే విధంగా మీ ఇద్దరి వాయిస్‌లోనూ ఓ రిచ్‌నెస్‌ ఉంటుందని పేర్కొంది. అయితే ఈ షో వల్ల మిమ్మల్ని కలిశానని, ఏదోక రోజు అల్లు అర్జున్‌ని చూస్తే తన కల నెరవేరుతుందని చెప్పుకొచ్చింది.

Exit mobile version
Skip to toolbar