Site icon Prime9

Amigos OTT Release: అమిగోస్‌ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది

amigos

amigos

Amigos OTT Release: కల్యాణ్‌రామ్‌ ట్రిపుల్‌ రోల్‌లో నటించిన యాక్షన్‌ థ్రిల్లర్ మూవీ ‘అమిగోస్‌’. ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిశ్రమ స్పందనలు అందుకుంది. అయితే, విలన్ పాత్రలో కల్యాణ్‌రామ్‌ నటనకు మంచి మార్కులే పడ్డాయి.

ఇక ఈ సినిమా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ ‘అమిగోస్‌’ స్ట్రీమింగ్‌ హక్కులను దక్కించుకున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో అమిగోస్ ఏప్రిల్‌ 1న నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అమిగోస్ స్ట్రీమింగ్‌ చేయనున్నారు. థియేటర్లలో ఈ సినిమాను చూడలేకపోయిన ప్రేక్షకులు మరికొద్ది రోజుల్లో ఇంట్లోనే చూసేయొచ్చు.

రాజేందర్‌రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీలో అషికా రంగనాథ్‌ కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

 

భారీ అంచనాలతో వచ్చి(Amigos OTT Release)

విడుదలకు ముందు నుంచే అమిగోస్ పై భారీ అంచనాలు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమా చూసి అద్భుతంగా ఉందని చెప్పడంతో .. నందమూరి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

సినిమా విడుదలైన రోజు హిట్ టాక్ వినిపించినా.. ఆ తర్వాత సినిమా బాక్సాఫీసు వద్ద ఢీలా పడింది.

ఈ సినిమా ఫుల్ రన్‌లో ప్రపంచ వ్యాప్తంగా రూ.7 కోట్ల మేర షేర్ వసూలు చేసిందని సమాచారం.

నిజానికి ఈ చిత్రం రూ.12 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కానీ, రూ. 7 కోట్లే వసూలు కావడంతో నిర్మాతలకు రూ.5 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సినీ వర్గాల టాక్.

మొత్తం మీద బ్లాక్ బస్టర్ టాక్‌తో మొదలై డిజాస్టర్‌గా మిగిలింది. కళ్యాణ్ రామ్(Kalyan Ram) గత చిత్రం ‘బింబిసార’ బ్లాక్ బస్టర్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాను కళ్యాణ్ రామే నిర్మించారు.

 

Exit mobile version