Site icon Prime9

Pushpa Movie : సౌత్ ఇండియా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ’పుష్ప‘ జోరు

leading-man-of-the-year-gq-moty-2022 award goes to Allu Arjun

leading-man-of-the-year-gq-moty-2022 award goes to Allu Arjun

Pushpa Movie: సౌత్ ఇండియా 67వ పార్లే ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో అల్లు అర్జున్ పుష్ప: ది రైజ్‌కి స్వీప్ చేసింది. అల్లు అర్జున్ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నాడు. సుకుమార్ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యాడు. ఈ చిత్రం ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ ఛాయాగ్రహణం, ఉత్తమ పురుష మరియు మహిళా గాయకులు, ఉత్తమ చిత్రం మరియు ఇతర విభాగాలలో అవార్డులను కూడా కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ అభిమానులకు, ప్రేక్షకులకు, ఫిల్మ్‌ఫేర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

లవ్ స్టోరీలో తన నటనకు సాయి పల్లవి ఉత్తమ నటిగా ఎంపికైంది మరియు శ్యామ్ సింఘా రాయ్‌లో తన నటనకు క్రిటిక్స్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డును కూడా అందుకుంది. నేచురల్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ నటనకు ఉత్తమ నటుడు (క్రిటిక్స్) జానులోని లైఫ్ ఆఫ్ రామ్ పాటకు గాను లెజెండరీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఉత్తమ సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌ను లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించారు. వైష్ణవ్ తేజ్ మరియు కృతి శెట్టి బెస్ట్ డెబ్యూ మేల్ మరియు బెస్ట్ డెబ్యూ ఫిమేల్ అవార్డులను అందుకున్నారు.

సూరరై పొట్రు చిత్రంలో తన అద్భుతమైన నటనకు సూర్య ఉత్తమ తమిళ నటుడు మరియు లిజోమోల్ జోస్ ఫిల్మ్‌ఫేర్ నుండి ఉత్తమ నటి అవార్డును పొందారు. సూరరై పొట్రు తమిళంలో అత్యధిక ఫిలింఫేర్ అవార్డులను గెలుచుకుంది.

Exit mobile version