Site icon Prime9

Allu Arjun : జీక్యూ అవార్డు అందుకున్న అల్లు అర్జున్‌

GQ award

GQ award

Allu Arjun : ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జీక్యూ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు ఈ ఏడాదికి గాను ఆయన్ని వరించింది. హైదరాబాద్‌ ఫలుక్‌నామా ప్యాలెస్‌లో జరిగిన వేడుకలో బన్ని ఈ అవార్డును అందుకున్నారు. లీడింగ్‌ మ్యాన్‌ ఆఫ్‌ 2022 అవార్డుతో తనను సత్కరించినందుకు జీక్యూ ఇండియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నా లక్ష్యాల జాబితాలోని ఒకదాన్ని ఇలా నెరవేర్చుకున్నా అంటూ బన్ని సంతోషం వ్యక్తం చేశారు.

జీక్యూ మ్యాగజైన్ కవర్ పేజీపై తన ఫొటో ఉండడాన్ని గౌరవంగా భావిస్తున్నానని తెలిపాడు. తన లక్ష్యాల జాబితాలో మరొకదాన్ని సాధించానని బన్నీ పేర్కొన్నాడు. ఈ అవార్డును అందించేందుకు జీక్యూ టీమ్ హైదరాబాదుకే తరలిరావడం విశేషం. అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

సుకుమార్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. ఈ చిత్రంలో బన్నికి జోడీగా రష్మిక నటిస్తోంది. పుష్ప బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి బన్నీకి పాన్ ఇండియా ఇమేజ్ ను తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమాను రష్యన్ భాషలోకి కూడ అనువదించారు.

Exit mobile version