Pushpa 2 Movie Creates History in Hindi: అల్లు అర్జున్ ‘పుష్ప 2’ రికార్డుల వేట ఆగడం లేదు. రోజురోజుకు ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. విడుదలకు ముందు నుంచి పుష్ప 2 రికార్డుల మోత మోగిస్తుంది. బాక్సాఫీసు వద్ద సునామీ వసూళ్లతో దూసుకుపోతుంది. ఇక నార్త్‌లో ఇప్పటి వరకు ఏ హిందీ సినిమా కూడా చేయని కలెక్షన్స్ పుష్ప 2 చేసింది. పుష్పరాజ్ దెబ్బకు అక్కడి బడా హీరోల ఆల్‌టైం రికార్డ్స్ గల్లంతయ్యాయి.
ఇప్పటి వరకు హిందీలో రూ. 618 కోట్ల నెట్ రాబట్టిన తొలి డబ్బింగ్ చిత్రంగా పుష్ప 2 నిలిచింది. నిన్నటి కలెక్షన్స్‌తో అక్కడ ‘పుష్ప 2’ చరిత్ర సృష్టించింది. ఇప్పటికే వరల్డ్ 1500 పైగా కోట్లు గ్రాస్ చేసిన ఈ సినిమా తాజాగా హిందీలో మరో మైలురాయిని చేరుకుంది. హిందీలో ఇప్పటి వరకు పుష్ప 2 కలెక్షన్స్ రూ. 632 కోట్ల నెట్‌కు చేరింది. ఇది బాలీవుడ్ చరిత్రలోనే హయ్యేస్ట్ గ్రాస్ సినిమాగా పుష్ప 2 నిలిచింది. వంద ఏళ్ల బాలీవుడ్ చరిత్రలో ఇంతవరకు ఏ హిందీ సినిమా కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ చేయలేదు. అక్కడ రూ. 632 కోట్ల నెట్ రాబట్టిన తొలి సినిమా ఇదే కావడం, అదీ కూడా డబ్బింగ్ చిత్రంగా పుష్ప 2 నిలవడం విశేషం.
The NUMBER ONE BLOCKBUSTER in the HISTORY OF HINDI CINEMA 🔥🔥#Pushpa2TheRule collects 632.50 CRORES NETT in Hindi – THE HIGHEST EVER FOR ANY HINDI FILM ❤🔥
Book your tickets now!
🎟️ https://t.co/tHogUVEgCt#Pushpa2#WildFirePushpa pic.twitter.com/shWGqGVvVb— Mythri Movie Makers (@MythriOfficial) December 20, 2024
తాజాగా ఈ విషయాన్ని స్వయంగా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ట్విటర్ ద్వారా ప్రకటించింది. ఇక హిందీలో పుష్ప 2 క్రేజ్ ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఈ రేంజ్‌లో సినిమాను ఆదరిస్తున్న బి-టౌన్ ఆడియన్స్ మేకర్స్ థ్యాంక్స్ చెబుతున్నారు. కాగా 100 ఏళ్ల బాలీవుడ్ చరిత్రలో ఈ ఫీట్ సాధించిన మొదటి చిత్రంగా పుష్ప 2 రికార్డులకెక్కింది. పుష్ప 2 కంటే ముందు ఈ రికార్డు ‘స్త్రీ 2’ సినిమాపై ఉంది. ఈ చిత్రం రూ. 625 కోట్లు వసూళ్లను సాధించి ప్రస్తుతం రెండో స్థానంలో నిలిచింది. అలాగే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా కూడా పుష్ప 2 నిలిచింది.