Site icon Prime9

Akash Puri: ఆకాశ్‌ పూరీ గొప్ప మనసు – నటి పావలా శ్యామలకు ఆర్థిక సాయం అందించిన హీరో, వీడియో వైరల్‌

Akash Puri Helps Pavala Shyamala: సీనియర్‌ నటి పావలా శ్యామల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుత జనరేషన్‌ ఆమెను గుర్తుపట్టకవోచ్చు. కానీ 90’s,20’s ఆడియన్స్‌ మాత్రం ఆమె నటన, కామెడీని మాత్రం మర్చిపోలేరు. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా వందల సినిమాల్లో చేసిన ఎంతోమంది సీనియర్‌ హీరోల సినిమాల్లో కూడా నటించించింది. ఎన్నో పాత్రలు పోషించి తనదైన నటన, కామెడీతో నవ్వించిన ఆమె ప్రస్తుతం వయోవృద్ధ సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఎదర్కొంటున్న ఆమెకు తాజాగా యంగ్‌ హీరో ఆర్థిక సాయం అందించి భరోసా ఇచ్చారు.

డ్యాషింగ్‌ అండ్‌ డేరింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ తనయుడు, హీరో ఆకాశ్‌ పూరీ పావలా శ్యామలకు ఆర్థిక సాయం చేశాడు. శనివారం ఆమె ఉంటున్న ఆశ్రమానికి స్వయంగా వెళ్లి కలిసి లక్ష రూపాయల చెక్కు అందించారు. ప్రస్తుతం ఈ డబ్బు ఇచ్చిన ఆకాశ్‌ భవిష్యతులు తనకు ఏ కష్టమొచ్చిన అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. దీంతో ఆకాశ్‌ పూరీ గొప్ప మనసుపై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. తన వీడియోపై ఆకాశ్‌ పూరీ స్పందించడంతో పావలా శ్యామలా ఎమోషనల్‌ అయ్యారు. ఆకాశ్‌ పూరీ ఆమెను కలిసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

కాగా వయోభారంతో, ఆర్థిక ఇబ్బందులతో ధీనస్థితిలో ఉన్న పావలా శ్యామల ఇటీవల ఓ వీడియో రిలీజ్‌ చేశారు. “యాభై ఏళ్లుగా క‌ష్ట‌ప‌డి న‌టిగా బ్రతికాను. కానీ ఈ మూడేళ్ల నుంచి నా ప‌రిస్థితి దీనంగా మారిపోయింది. ఇది అంద‌రికీ తెలుసు. నా సమస్యలను చాలా ఇంట‌ర్వ్యుల‌లో కూడా చెప్పాను. కానీ పెద్దగా ఎవ‌రు స్పందించ‌లేదు. ఇప్పుడు కొన ఊపిరితో ఉన్నాను.

చిరంజీవి, ప్రభాస్‌, మ‌హేశ్ బాబు, ఎన్టీఆర్ ఇలా ఎందరో పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సినిమాలు చేశాను. కానీ ఇప్పుడు ఆఖరికి ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉన్నాను. కనీసం మాట్లాడానికి కూడా శక్తి లేదు. కనీసం చికిత్స చేయించుకోలేక అవస్థలు పడుతున్నాను. ద‌య‌చేసి ఇండస్ట్రీ పెద్దలు దయదలచి నాకు సాయం చేయండి” అని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆమె వీడియో చూసి చలించిన ఆకాశ్‌ పూరీ ఆమెకు లక్షరూపాయల ఆర్థిక సాయం అందించడంతో మిగత ఇండస్ట్రీవారికి కనువిప్పు అంటున్నారు.

Exit mobile version